లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి కొత్త మూవీ ప్రకటించగా హీరోగా సంతోష్ శోభన్ చేస్తున్నారు. 'అన్నీ మంచి శకునములే' అనే క్లాస్సి టైటిల్ ఈ ప్రాజెక్ట్ కి ప్రకటించగా మూవీపై పాసిటివ్ బజ్ ఏర్పడింది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఏక్ మినీ కథ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఓటిటిలో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన దక్కింది. సంతోష్ శోభన్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన ఏక్ మినీ కథ సెక్స్ ఎడ్యుకేషన్ పై సెటైరికల్ కాన్సెప్ట్ తో రొమాన్స్, ఎమోషన్స్ కలగలిపి తెరకెక్కించారు. మొదటి చిత్రంతోనే మంచి విజయం అందుకున్న సంతోష్ శోభన్ మరో బంపర్ ఆఫర్ అందుకున్నారు.
లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి కొత్త మూవీ ప్రకటించగా హీరోగా సంతోష్ శోభన్ చేస్తున్నారు. 'అన్నీ మంచి శకునములే' అనే క్లాస్సి టైటిల్ ఈ ప్రాజెక్ట్ కి ప్రకటించగా మూవీపై పాసిటివ్ బజ్ ఏర్పడింది. స్వప్న సినిమా బ్యానర్ పై ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మాళవిక నాయర్ హీరోయిన్ గా ఎంపికయ్యారు. ఇక లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా అన్నీ మంచి శకునములే తెరకెక్కే సూచనలు కలవు.
సక్సెస్ ట్రాక్ లో ఉన్న హీరో, డైరెక్టర్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. సంతోష్ ఏక్ మినీ కథతో విజయం అందుకోగా, నందిని రెడ్డి ఓ బేబీ బ్లాక్ బస్టర్ తో మంచి ఊపుమీదున్నారు. 2019లో సమంత ప్రధాన పాత్రలో ఓ బేబీ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కొరియన్ మూవీ మిస్ గ్రాని రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం దర్శకురాలు నందిని రెడ్డికి బ్లాక్ బస్టర్ విజయం అందించింది. ఆ చిత్రం విడుదలై రెండేళ్లు పూర్తి అవుతుండగా నందిని రెడ్డి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించింది.
To some new beginnings... ఇక అన్నీ మంచి శకునములే ❤️https://t.co/v58mfNguNU pic.twitter.com/aKMz9HGeQ4
— Swapna Cinema (@SwapnaCinema)