బ్రేకింగ్ న్యూస్... విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన అమీర్ ఖాన్ దంపతులు

By team teluguFirst Published Jul 3, 2021, 12:15 PM IST
Highlights

బాలీవుడ్ వర్గాలను, అభిమానులను షాక్ కి గురిచేస్తూ అమీర్ ఖాన్ దంపతలు విడాకుల ప్రకటన చేశారు. 15ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతూ విడాకులు తీసుకుంటున్నట్లు అమీర్ దంపతులు తెలియజేశారు.


బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరున్న అమీర్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా బాంబ్ పేల్చారు. ఆయన తన భార్యతో కలిసి ఉమ్మడి లేఖ విడుదల చేశారు. 15ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతూ విడాకులు తీసుకుంటున్నట్లు అమీర్ దంపతులు తెలియజేశారు. పదిహేను సంవత్సరాల అందమైన దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు, అనుభవాలు పంచుకున్నాము. నమ్మకంతో కూడిన మా బంధం ప్రేమపూర్వకంగా సాగింది. అయితే ఇకపై మేము భార్య భర్తలుగా ఉండాలని అనుకోవడం లేదు... అంటూ లేఖలో పొందుపరిచారు. 


విడివిడిగా జీవించాలని నిర్ణయం తీసుకున్న మేము కొడుకు ఆజాద్ సంరక్షణ బాధ్యత కలిగి ఉన్నామని తెలియజేశారు. ఇక విడిపోవాలని కొన్నాళ్ల క్రితమే కలిసి నిర్ణయం తీసుకున్నాం. దానికి అధికారికంగా తెలియజేయడానికి ఇదే సమయం అని భావిస్తున్నాం అంటూ పేర్కొన్నారు. భార్యా భర్తలుగా విడిపోయినా కుటుంబాల మధ్య సంబంధాలు అలానే ఉంటాయి అన్నారు. ఇక ప్రొఫెషనల్ గా కూడా కలిసి పనిచేస్తామని తెలియాజేశారు. తమకు సపోర్ట్ ఇచ్చిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. 

1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్న అమీర్ ఖాన్ 2002లో ఆమెకు విడాకులు ఇవ్వడం జరిగింది. వీరికి జునైద్, ఐరా అనే అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. విడాకుల అనంతరం రీనా పిల్లల బాధ్యత తీసుకున్నారు.  అమీర్ ఖాన్ 2005లో లగాన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కిరణ్ రావ్ ని రెండవ వివాహం చేసుకున్నారు. సరోగసీ పద్దతి ద్వారా 2007లో కిరణ్ రావ్ కుమారుడు ఆజాద్ కి జన్మనివ్వడం జరిగింది. మోస్ట్ లవబుల్ కపుల్ గా ఉన్న వీరి విడాకుల ప్రకటన అందరినీ షాక్ కి గురిచేసింది.

AAMIR KHAN - KIRAN SEPARATE… JOINT STATEMENT… pic.twitter.com/YlixZbvtIA

— taran adarsh (@taran_adarsh)
click me!