Allu Sirish: ఎట్టకేలకు అల్లు శిరీష్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. అల్లు హీరో ఈజ్‌ బ్యాక్‌ ? ఇది అదేనా?

Published : Sep 24, 2022, 06:36 AM IST
Allu Sirish: ఎట్టకేలకు అల్లు శిరీష్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. అల్లు హీరో ఈజ్‌ బ్యాక్‌ ? ఇది అదేనా?

సారాంశం

అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తున్న సినిమా నుంచి ఎట్టకేలకు అప్‌డేట్‌ వచ్చింది. ఆయన నటిస్తున్న కొత్త సినిమా రిలీజ్‌ డేట్ ని ప్రకటించింది గీతా ఆర్ట్స్.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తమ్ముడు, యంగ్ హీరో అల్లు శిరీష్‌ కి హీరోగా కొంత గ్యాప్‌ వచ్చింది. ఆయన నటించిన చివరి చిత్రం `ఏబీసీడీ`నిరాశ పరిచింది. దీంతో కొత్త సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆ మధ్యన `ప్రేమ కాదంట` అనే చిత్రాన్ని ప్రకటించారు. జీఏ2 బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతుంది. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. పైగా అల్లు శిరీష్‌ కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో అనేక రూమర్స్ స్ప్రెడ్‌ అయ్యాయి. 

ఈ నేపథ్యంలో అల్లు శిరీష్‌ సినిమాకి సంబంధించి ఎట్టకేలకు అప్‌డేట్‌ వచ్చింది. ఆయన నటిస్తున్న కొత్త సినిమా విడుదల తేదీని ప్రకటించారు. గీతా ఆర్ట్స్ లో ఆయన హీరోగా నటించిన చిత్రాన్ని నవంబర్‌ 4న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటుందని, టైటిల్‌, ఫస్ట్ లుక్‌, టీజర్‌ వంటి అప్‌డేట్లని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. 

ఇదిలా ఉంటే జీఏ2(గీతా ఆర్ట్స్ 2) బ్యానర్‌లో ఆయన హీరోగా `ప్రేమ కాదంట` చిత్రం తెరకెక్కింది. ఇందులో అను ఇమ్మాన్యుయెల్‌ హీరోయిన్‌గా నటించింది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రకటించారు. రాకేష్‌ శశి దర్శకత్వం వహిస్తారని తెలిపారు. మరి ఇప్పుడు ప్రకటించిన సినిమా, `ప్రేమ కాదంట` ఒకటేనా? రెండూ వేర్వేరా? అనేది తెలియాల్సి ఉంది. అల్లు శిరీష్‌కి సంబంధించిన అనేక పుకార్ల నేపథ్యంలో ఆయన కొత్త సినిమా అప్‌డేట్‌ని ప్రకటించడంతో శిరీష్‌ ఈజ్‌ బ్యాకా? అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. 

ఇక `గౌరవం` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు శిరీష్‌. `కొత్తజంట`, `శ్రీరస్తు శుభమస్తు` వంటి చిత్రాలతో విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత శిరీష్‌ నటించిన చిత్రాలు ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయాయి. దీంతో ఇప్పుడు ఆయన ఒక్క హిట్‌ చాలా ఇంపార్టెంట్‌గా మారింది. మరి ఈ చిత్రంతోనైనా హిట్‌ కొడతాడా? అనేది చూడాలి. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా తెలిపిన సినిమాకి దర్శకుడెవరు? హీరోయిన్ ఎవరనే వివరాలు తెలపకపోవడం గమనార్హం.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

బాలకృష్ణ కెరీర్ లో ఎన్టీఆర్ వల్ల డిజాస్టర్ అయిన సినిమా ఏదో తెలుసా? దర్శకుడు ఎంత చెప్పినా రామారావు ఎందుకు వినలేదు?
Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్