క్రేజీ హీరోతో అల్లు శిరీష్ మల్టీస్టారర్ మూవీ

Published : Sep 02, 2019, 07:43 PM IST
క్రేజీ హీరోతో అల్లు శిరీష్ మల్టీస్టారర్ మూవీ

సారాంశం

అల్లువారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో శిరీష్ మెప్పించాడు. ఆ తర్వాత మళ్ళీ పరాజయాలు పలకరించాయి. ఈ ఏడాది విడుదలైన ఎబిసిడి చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

అల్లువారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో శిరీష్ మెప్పించాడు. ఆ తర్వాత మళ్ళీ పరాజయాలు పలకరించాయి. ఈ ఏడాది విడుదలైన ఎబిసిడి చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీనితో శిరీష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎలాంటి కథని ఎంచుకుంటున్నాడనే ఆసక్తి నెలకొంది. 

తాజాగా శిరీష్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. విజయ్ ఆంటోనితో కలసి మల్టిస్టారర్ చిత్రంలో నటించబోతున్నట్లు శిరీష్ ప్రకటించాడు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకుడు. ఇన్ఫినిటీ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. 

ఈ చిత్రంలో నటించే హీరోయిన్లు, ఇతర నటీనటుల వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు. బిచ్చగాడు, కిల్లర్ లాంటి చిత్రాలతో తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే
Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్