జీవితం విలువ తెలిసింది ముంబయిలోనే.. అల్లు శిరీష్!

By Siva KodatiFirst Published May 16, 2019, 8:49 AM IST
Highlights

మెగా సినీ బ్యాగ్రౌండ్ తో అల్లు శిరీష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. శ్రీరస్తు శుభమస్తు చిత్రం శిరీష్ కు తొలి బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం అల్లు శిరీష్ కామెడీ, రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఎబిసిడి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

మెగా సినీ బ్యాగ్రౌండ్ తో అల్లు శిరీష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. శ్రీరస్తు శుభమస్తు చిత్రం శిరీష్ కు తొలి బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం అల్లు శిరీష్ కామెడీ, రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఎబిసిడి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఎబిసిడి చిత్రం మే 17 శుక్రవారం విడుదల కానుంది. రాజీవ్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. రుక్సార్ థిల్లోన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు శిరీష్ ఈ చిత్రంలో అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ధనవంతుడిగా నటించబోతున్నాడు. 

తన తండ్రి ధనవంతుడైనా ఇండియాలో డబ్బు లేక శిరీష్ ఎలాంటి కష్ఠాలు అనుభవించాడనేది ఈ చిత్రంలో ఫన్నీగా చూపించబోతున్నారు. మాస్టర్ భరత్ శిరీష్ కు స్నేహితుడిగా నటిస్తున్నాడు. తాజాగా శిరీష్ ఓ ఇంటర్వ్యూలో ఎబిసిడి చిత్రం గురించి మాట్లాడాడు. ఎబిసిడి చిత్రంలోని తన పాత్ర నా నిజజీవితంలో కొంత పోలిక ఉంది. 

ముంబయి, విదేశాల్లో ఉన్న సమయంలో నాన్న నెలకు ఓసారి మాత్రమే కొంత మొత్తం డబ్బు ఇచ్చేవారు. కొన్ని సార్లు ముందుగానే డబ్బు ఖర్చుపెట్టేయడం వల్ల బస్సుల్లో కూడా తిరిగా అని శిరీష్ తెలిపాడు. ఆ సమయంలోనే డబ్బు విలువ, జీవితం అంటే ఏంటో తెలిసింది. తన సొంత డబ్బుతో కారు కొన్నపుడు రూపాయి విలువ ఏంటో, అది సంపాదించడం ఎంత కష్టమో అర్థం అయిందని శిరీష్ తెలిపాడు. 

ఇక ఓ నటుడిగా తాను దర్శకులకు, నిర్మాతలకు ఎలాంటి సలహాలు ఇవ్వనని శిరీష్ తెలిపాడు. నాతో సినిమా చేయడానికి వచ్చే దర్శకులకు, నిర్మాతలకు ఓ క్లారిటీ ఉంటుంది. అలాంటప్పుడు నా సలహాలు వాళ్లకు ఎందుకు.. నా అభిప్రాయాలని వారిపై రుద్దనని శిరీష్ తెలిపాడు. బడ్జెట్ ఎంతపెట్టాలి, బిజినెస్ ఎలా చేయాలి అనే నిర్ణయం నిర్మాతలదే అని శిరీష్ తెలిపాడు.  

click me!