హిట్టు లేని మెగా హీరో.. కోలీవుడ్ కోరికలు

Published : May 14, 2019, 04:47 PM ISTUpdated : May 14, 2019, 04:48 PM IST
హిట్టు లేని మెగా హీరో..  కోలీవుడ్ కోరికలు

సారాంశం

మెగా యువ హీరోలందరూ కెరీర్ లో మంచి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటూ వారికంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే అల్లు బ్రదర్ శిరీష్ మాత్రం ఇంకా అనుకున్నంత స్థాయిలో క్లిక్కవ్వడం లేదు. శ్రీరస్తూ శుభమస్తు తప్ప మిగతా సినిమాలన్నీ బోల్తా కొట్టినవే. 

అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని డిఫరెంట్ జానర్ లో తెరకెక్కిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఏబీసీడీ సినిమాతో రాబోతున్నాడు. వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోన్న శిరీష్ తన మనసులోని మరో కోరికను ఇటీవల బయటపెట్టాడు. 

బాలీవుడ్ లో ఎంట్రీ పై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అప్పుడే బాలీవుడ్ లోకి వెళ్లాలనే కొరిక ఏమి లేదని అంటూ.. తెలుగు సినిమాలు చేసుకోవడం హ్యాపీగా ఉందని అన్నాడు. అదే విధంగా కుదిరితే తమిళ్ సినిమాలో నటించాలని కోరికగా ఉందని అల్లు శిరీష్ వివరణ ఇచ్చాడు. అయితే కొన్ని నెలల క్రితం కెవి.ఆనంద్ - సూర్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో శిరీష్ కి అవకాశం వచ్చింది.

అయితే చివరి నిమిషాల్లో ఈ మెగా హీరో బయటకు వచ్చేశాడు. ఇక ఇప్పుడు మళ్ళీ తమిళ్ సినిమాపై ఇష్టం ఉందని ఆన్సర్ ఇచ్చేశాడు. ఇప్పటికే శిరీష్ మళయాళంలో కూడా ఎంట్రీ ఇచ్చాడు. మోహన్ లాల్ తో  1971:బియెన్డ్ బర్దార్స్ అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. మరి తమిళ్ లో ఈ అల్లు బ్రదర్ ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తాడో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?