
టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ మంచి గుర్తింపు పొందిన ఈయన.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హీరోగా ఎదుగుతున్నారు. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో మంచి సక్సెస్ ను అందుకున్న కిరణ్.. చివరిగా ‘సెబాస్టియన్ పీసీ 524’తో ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా అలరించకపోవడంతో తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టాడు కిరణ్. ఈ సందర్భంగా కిరణ్, హీరోయిన్ చాందిని నటించిన తాజా చిత్రం ‘సమ్మతమే’ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
అయితే ఈచిత్రం గ్రాండ్ రిలీజ్ కు ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ సినిమాకు పూర్తి మద్దతు తెలిపారు. సమ్మతమే చిత్రాన్ని జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆధ్వర్యంలో సమ్మతమే చిత్రాన్ని వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నాడు. ఈమేరకు మేకర్స్ కూడా అధికారిక ప్రకటన చేయనున్నారు. పేరున్న డిస్ట్రిబ్యూటర్స్ నుంచి సినిమా విడుదలవుతుండటంతో మూవీపై అంచనాలు ఏర్పడుతున్నాయి.
ఇప్పటికే ‘సమ్మతమే’ నుంచి వచ్చిన ట్రైలర్, టీజర్, సాంగ్స్, పోస్టర్స్ కూడా చాలా ఆకట్టుకుంటున్నాయి. దీనికితోడు మేకర్స్ కూడా ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తుండటంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఈ సందర్భంగా సినిమా ఎప్పుడా రిలీజ్ అంటూ ఎదురుచూస్తున్నారు. కిరణ్ కూడా తన ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తుండటంతో ఆయన సినిమాపై ఆడియెన్స్ లో ఆసక్తి నెలకొంది. హీరోయిన్ గా ‘కలర్ ఫొటో’ ఫేమ్ చాందిని (Chandini) నటిస్తోంది. వీరిద్దరూ క్రిష్ణ, సాన్వి అనే ప్రేమికుల పాత్రలో నటిస్తున్నారు. యూజీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మరోవైపు కిరణ్ వరుస చిత్రాలకు ఒకే చెబుతూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాల షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. అలాగే తాజాగా ఏఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఏంటర్ టైన్మెంట్ పతాకంపై కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి ‘రూల్స్ రంజన్’ అనే క్రేజీ టైటిల్ ను ఖరారు చేశారు. కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.