అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి ఫస్ట్ మీట్‌ నుంచి ఇప్పటి వరకు..అల్లువారి కోడలు ఐడియా అదిరింది!

Published : Apr 14, 2021, 08:44 PM ISTUpdated : Apr 14, 2021, 08:45 PM IST
అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి ఫస్ట్ మీట్‌ నుంచి ఇప్పటి వరకు..అల్లువారి కోడలు ఐడియా అదిరింది!

సారాంశం

స్టయిలీష్‌ స్టార్‌ లేటెస్ట్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య, అల్లు స్నేహారెడ్డి చేసిన ఐడియాకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. బన్నీ వైఫ్‌ క్రియేటివిటీకి ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం ఆమెని అభినందిస్తున్నారు. 

స్టయిలీష్‌ స్టార్‌ లేటెస్ట్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య, అల్లు స్నేహారెడ్డి చేసిన ఐడియాకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. బన్నీ వైఫ్‌ క్రియేటివిటీకి ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం ఆమెని అభినందిస్తున్నారు. ఇటీవల సోషల్‌ మీడియాలో చురుకుగా ఉంటున్న అల్లు స్నేహారెడ్డి బన్నీతో తన పస్ట్ మీట్‌‌ నుంచి ఇప్పటి వరకు లైఫ్‌ని ఒకే ఒక్క ఫోటోల్లో బంధించి ప్రతిబింబింప చేయడం విశేషం. 

తాజాగా స్నేహారెడ్డి అల్లు అర్జున్‌, తమ పిల్లలతో కలిసి దిగిన నాలుగు ఫోటోలను ఓ ఫ్రేమ్‌గా డిజైన్‌ చేయించింది. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సోషల్‌ మీడియా అభిమానులతో పంచుకుంది. ఇందులో స్నేహారెడ్డి, బన్నీతో తన పరిచయం నుంచి పిల్లలు పుట్టే వరకు ఒకే పోజులో స్కూటర్‌పై దిగిన ఫోటోలను పంచుకుంది. ఇందులో మొదట బన్నీ, స్నేహారెడ్డి మాత్రమే ఉండగా, రెండో ఫోటోలో బన్నీ, స్నేహారెడ్డితోపాటు కుమారుడు అల్లు అయాన్ ఉన్నాడు. మూడో ఫోటోలు వీరికి కూతురు అర్హ తోడయ్యింది. చివరకు ఈ నలుగురు ప్రస్తుతం ఎంత హ్యాపీగా ఉన్నారో చూపించారు. 

ఒకే ప్లేస్‌లో, ఒకే కలర్‌ స్కూటీపై, ఒకే స్టయిల్‌లో వీరు ఫోటో దిగడం, అయితే టైమ్‌కి తగ్గట్టుగా ఫేస్‌లో మార్పులు, డ్రెస్‌లో మార్పులు చేశారు. ఈ నాలుగు ఫోటోలను కలిపి ఒక ఫ్రేమ్‌గా చేశారు. దాన్ని ఇన్‌స్టాలో స్నేహారెడ్డి పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటో తెగ వైరల్‌ అవుతుంది. బన్నీ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల స్పందించి క్యూట్‌ అంటూ కామెంట్‌ పెట్టింది. ఇదిలా ఉంటే ఇటీవల బన్నీ తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేసొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బన్నీ `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తుంది. ఇది ఆగస్ట్ 13న విడుదల కానుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?