సెట్‌లో చూస్తూ హీరోయిన్ కు దొరికిపోయిన బన్నీ

Published : Jun 17, 2019, 09:37 AM IST
సెట్‌లో చూస్తూ హీరోయిన్ కు దొరికిపోయిన బన్నీ

సారాంశం

స్టార్స్ నటించే సినిమా సెట్లో చాలా సరదాలు జరుగుతూంటాయి. 

 

స్టార్స్ నటించే సినిమా సెట్లో చాలా సరదాలు జరుగుతూంటాయి. అలాగే వాటిపైన అభిమానులకు కూడా చాలా ఇంట్రస్ట్ ఉంటుంది. తాజాగా అల్లు అర్జున్ కు సంభందించిన ఓ వీడియో అలాగే ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

అదేంటంటే.. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమా సెట్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ చూశారు. ఎంతో ఉత్కంఠగా ఆయన మ్యాచ్‌ చూస్తుండగా తీసిన వీడియోను  హీరోయిన్  పూజా హెగ్డే చూసి వెంటనే కాప్చర్ చేసేసారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోని  ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశారు. బన్నీ మొబైల్‌ ఫోన్‌లో మ్యాచ్‌ చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’వంటి డిజాస్టర్ చిత్రం తర్వాత అల్లు అర్జున్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.  హారిక అండ్‌ హాసిని, గీతా ఆర్ట్స్‌ పతాకంపై సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమాలో బన్నీ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గా కనపడనున్నట్లు తెలుస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?
Director KK Passed Away: నాగార్జున `కేడి` మూవీ డైరెక్టర్‌ కన్నుమూత.. సందీప్‌ రెడ్డి వంగాకి ఈయనే గురువు