అఫీషియల్ :‘సాహో’ సంగీత దర్శకుడు అతడే!

By Prashanth MFirst Published Jun 17, 2019, 8:41 AM IST
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న ‘సాహో’ సినిమా నుంచి సంగీత త్రయం శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ తప్పుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఎవరినీ మ్యూజిక్ డైరక్టర్ గా ఫైనలైజ్ చేస్తారనే చర్చ అంతటా జరిగింది. రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఫైనల్ గా చిత్ర యూనిట్  జిబ్రాన్‌  ..ఈ సినిమాకు ఆయన సంగీతం అందించనున్నట్లు  అధికారికంగా ప్రకటించింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న ‘సాహో’ సినిమా నుంచి సంగీత త్రయం శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ తప్పుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఎవరినీ మ్యూజిక్ డైరక్టర్ గా ఫైనలైజ్ చేస్తారనే చర్చ అంతటా జరిగింది. రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఫైనల్ గా చిత్ర యూనిట్  జిబ్రాన్‌  ..ఈ సినిమాకు ఆయన సంగీతం అందించనున్నట్లు  అధికారికంగా ప్రకటించింది. ‘రన్ రాజా రన్’, ‘విశ్వరూపం’, ‘జిల్’ వంటి చిత్రాలకు జిబ్రాన్ సంగీతం అందించారు. ‘సాహో చాప్టర్ 2’కి కూడా ఆయనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

రన్ రాజా రన్ వంటి సూపర్ హిట్ చిత్రం చేసినప్పుడు దర్శకుడు సుజిత్ తో వర్క్ పరంగా జిబ్రాన్ కు మంచి అనుబంధం ఏర్పడింది. సాహో భారీ ప్రాజెక్ట్ కావడంతో టాలెంటెడ్ జిబ్రాన్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసేందుకు ఎంపిక చేసుకున్నామని చిత్రం దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతీ సీన్ ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ రికార్డింగ్ అందించనున్నారు జిబ్రాన్. ఇక ఈ సాహో చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్ గా విడుద‌ల కి సిద్ధ‌మౌతోంది.

‘సాహో’ సినిమాకు సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌  హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో  నీల్‌ నితిన్‌ ముకేష్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఆగస్టు 15న సినిమా విడుదల కాబోతోంది. 

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

click me!