
పుష్ప షూటింగ్ నుండి అల్లు అర్జున్ చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఖాళీ సమయంలో ఆయన వరుణ్ తేజ్ మూవీ గని సెట్స్ కి వెళ్లడం జరిగింది. గని షూటింగ్ ని పరిశీలించిన అల్లు అర్జున్, హీరో వరుణ్ తేజ్, దర్శక నిర్మాతలకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ మేరకు అల్లు అర్జున్ ట్వీట్ చేయడం జరిగింది.
అల్లు అర్జున్ అన్నయ్య అల్లు వెంకట్ గని మూవీతో నిర్మాతగా మారారు. ఆయన మరో నిర్మాత సిద్దు ముద్దా తో కలిసి గని చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాతగా అల్లు వెంకట్ జర్నీ సక్సెస్ ఫుల్ గా సాగాలని అల్లు అర్జున్ కోరుకున్నారు. గని చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు.
అల్లు అర్జున్ ట్వీట్ కి వరుణ్ తేజ్ రిప్లై ఇచ్చారు. బెస్ట్ విషెస్ చెప్పిన అల్లు అర్జున్ కి కృతజ్ఞతలు తెలుపుతూ, మీరు గని మూవీ సెట్స్ కి రావడం సంతోషంగా ఉందంటూ తన ట్వీట్ లో తెలియజేశారు. ఇక గని బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. గని కోసం వరుణ్ చాలా కష్టపడ్డారు. ప్రొఫెషనల్స్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకోవడంతో పాటు, కండలు తిరిగిన బాడీ పెంపొందించారు.