గీతాఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ సినిమా..?

Published : Aug 25, 2018, 05:04 PM ISTUpdated : Sep 09, 2018, 11:37 AM IST
గీతాఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ సినిమా..?

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు గీతాఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేయబోతున్నాడా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 

సూపర్ స్టార్ మహేష్ బాబు గీతాఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేయబోతున్నాడా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి కథ ఏంటి..? డైరెక్టర్ ఎవరనే విషయాలు తెలియనప్పటికీ గీతాఆర్ట్స్ లో మహేష్ సినిమా ఖాయమని అంటున్నారు. ప్రస్తుతానికి మహేష్ 'మహర్షి' సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా అలానే మైత్రి మూవీ మేకర్స్ వారితో మరో సినిమా కమిట్ అయ్యాడు.

ఇప్పుడు లిస్ట్ లో గీతాఆర్ట్స్ కూడా వచ్చి చేరింది. నిజహానికి అల్లు అరవింద్ ఇప్పటివరకు మెగాహీరోలు అలానే మిడిల్ రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు తన రూట్ మార్చి గీతాఆర్ట్స్ లో పెద్ద హీరోలతో సినిమాలు చేయాలనుకుంటున్నాడు. ఈ విషయంపై మహేష్ తో చర్చించగా.. సినిమా చేయడానికి మహేష్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు మహేష్ కోసం మంచి కథను సెట్ చేసే పనిలో పడింది గీతాఆర్ట్స్. ఇక ఇదే బ్యానర్ లో చిరంజీవి-కొరటాల సినిమా అలానే బన్నీ సినిమా రూపొందనుంది. ఇక భారీ బడ్జెట్ సినిమాలతో గీతాఆర్ట్స్ తన దూకుడు ప్రదర్శించనుందన్నమాట!

PREV
click me!

Recommended Stories

Anasuya Controversy: ఆ రోజే నిలదీయాల్సింది, తప్పు వాళ్లవైపు తిప్పుతూ నటి రాశికి అనసూయ సారీ నోట్‌
Rithu Chowdary: తాళి తీసుకెళ్లడంతోనే విడాకులు, రీతూ చౌదరీ పెళ్లి విషయంలో జరిగింది ఇదే.. బిగ్‌ బాస్‌ షో మంచే చేసిందా?