అల్లు అర్జున్ ఈ రోజు క్లారిటీ ఇచ్చేస్తారా..మీడియాలో అదే చర్చ

By Surya Prakash  |  First Published Nov 27, 2021, 8:00 PM IST

అల్లు అర్జున్ ప్రస్తుతం "పుష్ప: ది రైజ్" సినిమాతో బిజీగా ఉన్నాడు.   నిజానికి ఈ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో "ఐకాన్" సినిమా చేయాల్సి ఉంది. కానీ బన్నీ ఈ సినిమాని పక్కన పక్కకుపెట్టి బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్న సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారని చెప్పుకుంటున్నారు.  


అల్లు అర్జున్ తన నెక్ట్స్ సినిమా ఏ దర్శకుడుతో చేయబోతున్నాడనే విషయమై సినీ,మీడియా వర్గాల్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి, అల్లు అర్జున్ ..అఖండ ప్రీ రిలీజ్ పంక్షన్ కు వస్తున్నారు. ఈ రోజు సాయింత్రం హైదరాబాద్ లో ఈ ఈవెంట్ జరుగుతోంది. ఈ స్టేజీపైనే తన తదుపరి చిత్రం ఎనౌన్స్ ..అల్లు అర్జున్ చేస్తారని అందరూ భావిస్తున్నారు. ఇండస్ట్రీలో చెప్పుకునే దాని ప్రకారం  బోయపాటితో తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ ఎనౌన్స్ చేయబోతున్నారు. దాంతో వేణు శ్రీరామ్ చిత్రాన్ని ప్రక్కన పెట్టినట్లు అవుతుందని అంటున్నారు. ఈ విషయమై అఫీషియల్ గా స్టేజీపైనే చెప్తాడంటున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సరైనోడు చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.
 
అల్లు అర్జున్ ప్రస్తుతం "పుష్ప: ది రైజ్" సినిమాతో బిజీగా ఉన్నాడు.   నిజానికి ఈ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో "ఐకాన్" సినిమా చేయాల్సి ఉంది. కానీ బన్నీ ఈ సినిమాని పక్కన పక్కకుపెట్టి బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్న సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారని చెప్పుకుంటున్నారు.  వేణు శ్రీరామ్ దర్శకత్వంలో "ఐకాన్" సినిమా ఓకే అయినా పెద్దగా కదలిక లేదు. ఎప్పటికప్పుడు సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే వస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కోసం ఒక కమర్షియల్ సినిమా కథని తీసుకువచ్చి ఇంప్రెస్ చేశారట. "పుష్ప" వంటి రా సినిమా తర్వాత ఇలాంటి కమర్షియల్ సినిమా చేస్తే బాగుంటుందని అల్లు అర్జున్ కూడా ఈ సినిమాని ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. అది నిజమా కాదా అనేది ఈ రోజు తేలిపోతుంది.
 
ఇక అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప విషయానికి వస్తే.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాకోసమే బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా.. అనసూయ, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రష్మిక డీ గ్లామర్ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  డిసెంబర్ 17వ పుష్ప మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ, ఏ బిడ్డ ఇది నా అడ్డా అనే పాటలు ప్రేక్షకులను విపరీతంగా కట్టుకున్నాయి.  

click me!