వక్కంతం వంశీ సినిమాలో జవాన్ పాత్రలో అల్లు అర్జున్

First Published Apr 17, 2017, 2:35 PM IST
Highlights
  • వక్కంతం వంశీ సినిమాలో జవాన్ పాత్రలో అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం చిత్రం తర్వాత తదుపరి చిత్రాన్ని వేగంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారి రూపొందిస్తున్న చిత్రంలో అల్లు అర్జున్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారనే విషయం ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఈ చిత్రానికి నా పేరు శివ. నా ఇల్లు ఇండియా అనే టైటిల్ ఖారారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

 

దర్శకుడిగా వక్కంతం వంశీ దువ్వాడ జగన్నాథం చిత్రం షూటింగ్‌లో ఉండగానే వక్కంతం వంశీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు స్టైలిష్ స్టార్. అతిథి, కిక్, టెంపర్, కిక్2 లాంటి చిత్రాలకు వంశీ కథలను అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నా పేరు శివ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నాడు.. ఈ చిత్రంలో తమిళ నటుడు అర్జున్ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. కన్నడ నటి రష్మిక మండన్నా హీరోయిన్‌గా ఎంపికైంది.

 

జాతీయ అవార్డు గ్రహీత, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి కెమెరామెన్ బాధ్యతలను చేపట్టనున్నారు. లగడపాటి శ్రీధర్ నిర్మాతగా వహిస్తున్న చిత్రానికి విశాల్, శేఖర్ సంగీతం అందిస్తారు. నా పేరు శివ జూన్‌లో పట్టాలు ఎక్కనున్నట్టు సమాచారం.

 

ఇక దువ్వాడ జగన్నాథం రిలీజ్ తర్వాత వంశీ చిత్రంలో నటించనున్న అల్లు అర్జున్ ఆ తర్వాత లింగుస్వామి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో రూపొందించేందుకు ప్లాన్ చేశారు.

click me!