రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఐకాన్‌ స్టార్‌.. క్రేజ్‌ మాత్రం కేక

Google News Follow Us

సారాంశం

 జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన నేషనల్‌ అవార్డు స్వీకరించారు. గత నెలలో జాతీయ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.

69వ నేషనల్‌ అవార్డుల ప్రదానం మంగళవారం జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. ఇక ఇందులో జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ అవార్డు అందుకున్నారు. గత నెలలో జాతీయ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. `పుష్ప` చిత్రానికి గానూ జాతీయ ఉత్తమ నటుడిగా  బన్నీ పురస్కారాన్ని, నేషనల్‌ అవార్డుని అందుకున్నారు. దీంతో బన్నీ స్టేజ్‌పైకి వెళ్లే క్రమంలో అంతా కరతాల ధ్వనులతో హోరెత్తించారు. 

ఇక సోమవారం తన భార్య స్నేహారెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన అల్లు అర్జున్‌.. నేడు ముందుగా రెడ్‌ కార్పెట్‌లో పాల్గొన్నారు. ఆయన వైట్‌ టూ వైట్‌ డ్రెస్‌లో మెరిశారు. రాయల్‌ లుక్‌లో అందరి చూపులు తనవైపు తిప్పుకున్నారు. అంతేకాదు తనకు నేషనల్‌ అవార్డు రావడం ఆనందంగా ఉందని, కమర్షియల్‌గా ఇప్పటికే సినిమా పెద్ద హిట్‌ కాగా, ఇప్పుడు అవార్డు కూడా రావడం డబుల్‌ హ్యాపీగా అని తెలిపారు. అవార్డు అందుకునేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నట్టు చెప్పారు బన్నీ. 

అయితే ఇందులోయాంకర్‌ ఏదైనా డైలాగ్‌ చెప్పమని చెప్పగా, తెలుగులోనే డైలాగ్‌ చెప్పారు. `పుష్ప` సిగ్నేచర్‌ డైలాగ్‌, సిగ్నేచర్‌ మూమెంట్‌.. `పుష్ప పుష్ప రాజ్‌ నీ యవ్వ తగ్గేదెలే` అంటూ ఆయన తన మ్యానరిజం చూపించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అందరిని ఆకట్టుకుంటుంది. ఇక 69వ జాతీయ అవార్డు వేడుకలో `పుష్ప` టీమ్‌ కూడా పాల్గొంది. నిర్మాతలు, అలాగే `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌, రాజమౌళి, ఇతర అవార్డు విన్నర్స్ ఇందులో పాల్గొని సందడి చేశారు. జాతీయ అవార్డులను అందుకున్నారు. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on