అల్లు అర్జున్‌ `పుష్ప` షూటింగ్‌లో విషాదం.. స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌ కన్నుమూత..

Published : Jan 29, 2021, 07:45 AM IST
అల్లు అర్జున్‌ `పుష్ప` షూటింగ్‌లో విషాదం.. స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌ కన్నుమూత..

సారాంశం

ప్రముఖ స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌ జి.శ్రీనివాస్‌(54) కన్నుమూశారు. గురువారం అర్థరాత్రి(శుక్రవారం 1am) రాజమండ్రిలో గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. అల్లు అర్జున్‌ `పుష్ప` షూటింగ్‌ నిమిత్తం మారేడుమిల్లి వెళ్లిన శ్రీనివాస్‌కి ఆరోగ్యం బాగాలేకపోవడంతో లొకేషన్‌ లోని అంబులెన్స్ లో రాజమండ్రి తరలిస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది.

ప్రముఖ స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌ జి.శ్రీనివాస్‌(54) కన్నుమూశారు. గురువారం అర్థరాత్రి(శుక్రవారం 1am) రాజమండ్రిలో గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. అల్లు అర్జున్‌ `పుష్ప` షూటింగ్‌ నిమిత్తం మారేడుమిల్లి వెళ్లిన శ్రీనివాస్‌కి ఆరోగ్యం  బాగాలేకపోవడంతో లొకేషన్‌ లోని అంబులెన్స్ లో రాజమండ్రి తరలిస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది. దీంతో `పుష్ప` యూనిట్‌లో విషాదం నెలకొంది. విషయం తెలిసి అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌, ఇతర టీమ్‌ దిగ్ర్భాంతికి గురయ్యారు. 

అదే సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలోనూ విషాదం నెలకొంది. జి.శ్రీనివాస్‌ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. జి. శ్రీనివాస్‌ రెండు వందలకుపైగా సినిమాలకు స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. తారలకు చెందిన  అద్భుతమైన ఫోటోలు తీసిన ఘనత ఆయనది. లొకేషన్‌లోనూ సహజత్వాన్ని పట్టి ఫోటోల్లో బంధించేవారు. ఆయన మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయ. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది