పుష్ప 2 సూసేకి సాంగ్ పై కాపీ ఆరోపణలు... దేవిశ్రీ అక్కడ లేపేశాడా? 

Published : May 30, 2024, 02:51 PM IST
పుష్ప 2 సూసేకి సాంగ్ పై కాపీ ఆరోపణలు... దేవిశ్రీ అక్కడ లేపేశాడా? 

సారాంశం

పుష్ప 2 నుండి సెకండ్ సాంగ్ విడుదల చేశారు. సూసేకి... అనే పేరుతో వచ్చిన ఈ లిరికల్ వీడియోను ట్రోల్ చేస్తున్నారు. ఇది ఓ సాంగ్ కి కాపీ అంటూ ఆరోపణలు చేస్తున్నారు.   

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఉన్నారు దేవిశ్రీ ప్రసాద్, ఎస్ ఎస్ థమన్. మణిశర్మ హవా తగ్గాక వీరిద్దరూ జోరు చూపిస్తున్నారు. అయితే దేవిశ్రీ, థమన్ తరచుగా కాపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. థమన్ అయితే ప్రతి సినిమాకు ఏదో ఒక సాంగ్ విషయంలో కాపీ చేశాడనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. దర్శకుడు సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పుష్ప 2 సాంగ్ కి కూడా కాపీ ఆరోపణలు తప్పలేదు. 

పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సాంగ్ 'పుష్ప పుష్ప' విశేష ఆదరణ దక్కించుకుంది. అయితే సెకండ్ సాంగ్ 'సూసేకి' పర్లేదు అనిపించుకుంది. శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటలో మాస్ అప్పీల్ తగ్గిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సాంగ్ తెలంగాణా జానపద సాంగ్ కి కాపీ అంటున్నారు. ఈ మేరకు రెండు సాంగ్స్ ని కంపేర్ చేస్తూ సోషల్ మీడియా పోస్ట్స్ దర్శనం ఇస్తున్నాయి. 

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప 2పై కాపీ ఆరోపణలు రావడం విచారకరం. దేవిశ్రీ మరింత జాగ్రత్త తీసుకుని మంచి సాంగ్స్ ఇవ్వాల్సి ఉంది. పుష్ప సక్సెస్ లో దేవిశ్రీ పాత్ర ఎంతగానో ఉంది. ఆయన స్వరపరిచిన బీజీఎమ్ అద్భుతంగా కుదిరింది. ఇక శ్రీవల్లీ, సామి సామి, ఊ అంటావా మామా.. సాంగ్స్ మాస్ ఆడియన్స్ ని ఊపేశాయి. 

పుష్ప 2 ఆగస్టు 15న వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల కానుంది. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. ఫహాద్ ఫాజిల్ మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతిబాబు కీలక రోల్స్ చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Spider Man Collections: ఇండియాలో ఎండ్‌గేమ్ రికార్డు బ్రేక్, స్పైడర్-మ్యాన్ కలెక్షన్ల సునామీ
Pradeep Rawat: చత్రపతి విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం.. కారణం ఏంటో తెలుసా?