`యానిమల్` సినిమాపై తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. సినిమా టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఓ అదిరిపోయే స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
`యానిమల్` మూవీపై రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. కొందరు ఇది సెక్స్, బోల్డ్ కంటెంట్, తండ్రిపై లవ్ విషయాల్లో ఓవర్ డోస్ కంటెంట్‌గా చెబుతున్నారు. మరికొందరు ఇప్పుడు యూత్‌కి ఇదే కావాలని, సినిమా బౌండరీలు బ్రేక్ చేసి తీశారని ప్రశంసిస్తున్నారు. ఎవరేం చెప్పినా బాక్సాఫీసు వద్ద సినిమా దుమ్మురేపుతుంది. నేటి జనరేషన్‌కి ఇదే కావాలనేలా ఆడియెన్స్ దీన్ని చూసి ఆదరిస్తున్నారు. ఈ సినిమా వారం రోజుల్లో ఐదు వందల అరవై కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా నచ్చిందని చాలా మంది సెలబ్రిటీలు అభినందనలు తెలియజేస్తున్నారు. మేకర్స్ పై, ఆర్టిస్ట్ లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. సినిమా చూసిన ఆయన తనదైన స్టయిల్‌లో రివ్యూ చెప్పారు. సినిమా ఎలా ఉందో డిటెయిల్‌గా వివరించారు. సినిమాని ఇండియన్ క్లాసిక్‌గా వర్ణించడం విశేషం. `యానిమల్` మూవీ జస్ట్ మైండ్ బ్లోయింగ్ అని, సినిమాటిక్ బ్రిలియన్స్ ఎగిరిపోయిందంటూ టీమ్ కి అభినందనలు తెలిపారు. ఇందులో రణ్ బీర్ కపూర్ గురించి మాట్లాడుతూ, ఇండియన్ సినిమా పర్‌ఫెర్మెన్స్ ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లారని, చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉందని, మీరు సృష్టించిన మ్యాజిక్‌ని వివరించడానికి తన వద్ద పదాలు లేవని, మీ అత్యుత్తమ నటన స్థాయికి నా గౌరవాలు అని వెల్లడించారు.
ఇక రష్మిక మందన్నా గురించి చెబుతూ, బ్రిలియంట్‌గా నటించిందని, ఇది మీ అత్యుత్తమ పర్ఫెర్మెన్స్ అని, ఇంకా మరింత స్థాయికి వెళ్లాలి అన్నారు. బాబీ డియోల్ తన అద్భుతమైన నటనతో తమని సైలెంట్ చేశాడని, ఆయన అద్బుతమైన నటనని గౌరవిస్తున్నట్టు చెప్పారు. అనిల్ కపూర్ అప్రయత్నంగా చేసుకుంటూ వెళ్లారని, తన అనుభవం కనిపిస్తుందని, ఆ ఎక్స్ పీరియెన్స్ చాలా గొప్పదని చెప్పారు. ఇక బెడ్ సీన్లో నటించిన తృప్తి డిమ్రి హార్ట్ బ్రేక్ చేసిందని, మున్ముందు ఇలా మరింతగా బ్రేక్ చేయాలన్నారు.
. Just mind blowing. Blown away by the cinematic brilliance. Congratulations! ji just took Indian cinema performances to a whole new level. Very Inspiring . I am truly in loss of words to explain the magic you’ve created . My deep Respects to the highest…
— Allu Arjun (@alluarjun)ఇక ఆర్టిస్టులు, టెక్నీషియన్లకి అభినందనలు తెలిపిన బన్నీ.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. డైరెక్షన్ జస్ట్ మైండ్ బ్లోయింగ్ అని, సినిమా పరిమితులను అధిగమించారని, సినిమా తీవ్రత సాటిలేనిదని, మీరు మరోసారి మా అందరినీ గర్వపడేలా చేశారని, మీ సినిమాలు ఇప్పుడు, భవిష్యత్‌లో భారతీయ సినిమా ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతున్నాయో నేను స్పష్టంగాచూడగలను అని ప్రశంసలు కురిపించారు పుష్పరాజ్. ఇక ఫైనల్‌గా `యానిమల్` సినిమా ఇండియన్ క్లాసిక్ చిత్రాల్లో చేరిపోతుందన్నారు. ఈ మేరకు బన్నీ ట్వీట్(ఎక్స్) చేశారు. ఇది వైరల్ అవుతుంది.