#Pushpa2 ఓవర్ సీస్ రైట్స్ రేటు, `సలార్' ని మించి... ?

Published : Oct 26, 2023, 01:35 PM IST
 #Pushpa2 ఓవర్  సీస్ రైట్స్ రేటు, `సలార్' ని మించి... ?

సారాంశం

 రష్యాతోపాటు... 20కి పైగా  దేశాల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఈ నేపధ్యంలో  ఈ చిత్రం ఓవర్ సీస్ ఎంక్వైరీలు మొదలయ్యాయి.

లేటుగా మొదలైనా  ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2) కు ఉన్న పిచ్చ క్రేజ్ కు బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోంది. అలాగే  చిత్ర టీమ్ పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తోంది.   ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఒకేసారి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే వ్యూహంతో నిర్మాణం చేపడుతున్నారు. ఫస్ట్ పార్ట్  సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. భాషతో సంబంధం లేకుండా పుష్ప మేనరిజమ్‌తోనూ, డైలాగ్‌తోనూ ప్రపంచం మొత్తం ఊగిపోయింది. ఆ రెస్పాన్స్ ని దృష్టిలో ఉంచుకునే కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప: ది రూల్‌’ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్  తో తెరకెక్కించడంతోపాటు, ఒకేసారి  పలు భాషల్లో విడుదల చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు నిర్మాతలు.  

‘పుష్ప: ది రూల్‌’ సినిమాని మాత్రం భారత్‌లో విడుదల చేసిన రోజునే, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించింది. రష్యాతోపాటు... 20కి పైగా  దేశాల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఈ నేపధ్యంలో  ఈ చిత్రం ఓవర్ సీస్ ఎంక్వైరీలు మొదలయ్యాయి. అయితే ఎంత రేటు చెప్తున్నారు అంటే...

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రష్మిక మందన్న హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ చిత్రం అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అభిమానులైతే ఏకంగా ధర్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.  ‘పుష్ప2’ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ 100 కోట్లు చెప్తున్నట్లు సమాచారం. మరో ప్రక్క ప్రభాస్ ప్రతిష్టాత్మక చిత్రం  #Salaar ఓవర్ సీస్ రైట్స్  72 కోట్లు కు ఫైనల్ చేసారు. ఇప్పుడు ‘పుష్ప2’ రైట్స్ రేటు ఫైనల్ కాకపోనప్పటికీ ... పెద్ద మొత్తమే అంటున్నారు.   

ఇప్పటికే ‘పుష్ప2’ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఆ మధ్యన  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫహాద్ ఫాజిల్‌ ఆ అంచనాలను పెంచేశారు. రెండో భాగంలో భన్వర్‌ సింగ్‌ పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పారు. హీరోకు ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయన్నారు. ఇక ఈ సీక్వెల్‌లో భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్‌ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయినట్లు సమాచారం. 2021లో విడుదలై సూపర్‌హిట్‌ అందుకున్న ‘పుష్ప: ది రైజ్‌’కి కొనసాగింపుగా తెరకెక్కుతున్నదే ‘పుష్ప: ది రూల్‌’ (పుష్ప 2). అల్లు అర్జున్‌ సరసన రష్మిక నటిస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RRR నటి రూ.350 కోట్ల విలువైన బంగ్లా ఇదే.. గృహప్రవేశం ఫోటోలు ఇవిగో
First Finalist: బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఫస్ట్ ఫైనలిస్ట్ కన్ఫమ్‌.. తనూజ చేసిన మోసానికి రీతూ బలి