#Pushpa2: ‘పుష్ప2’ కి పోటీ ఏమో కానీ ఇరుకున అయితే పెడతారు ?

Published : Mar 06, 2024, 01:34 PM IST
  #Pushpa2: ‘పుష్ప2’ కి పోటీ ఏమో కానీ ఇరుకున అయితే పెడతారు ?

సారాంశం

పుష్ప 2 విషయానికి వస్తే ...ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఒకేసారి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే వ్యూహంతో నిర్మాణం చేపడుతున్నారు. 

ఇప్పుడు అందరి దృష్టీ పుష్ప2 మీదే ఉంది. ఎప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుందా....అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్ని రికార్డ్ లు బ్రద్దలు కొడదామా అని నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. అదే సమంయలో ఈ సినిమాకు పోటీ ఇవ్వటానికి మరికొన్ని సినిమాలు అదే రిలీజ్ డేట్ కు దిగుతున్నాయి. అయితే చిన్న సినిమాలుని ఎవరూ పట్టించుకోరు. కానీ అటు నుంచి వస్తోంది మామూలు సినిమాలు కాదంటున్నారు. అయితే అవేమీ తెలుగు మార్కెట్ నుంచి వస్తున్న సినిమాలు కాదు..పోటీ ఓ రేంజిలో ఉంటుందంటున్నారు.  అయితే కంటెంట్ పరంగా పుష్ప 2 కు ఎదురు నిలవటం కష్టమైనా ... థియేటర్స్ విషయంలో ఇబ్బంది ఈ పోటీగా వచ్చే సినిమాలతో జరుగుతుందంటోంది ట్రేడ్ . ఆ సినిమాలు ఏమిటో చూద్దాం.  

  అందుతున్న సమాచారం మేరకు ...రోహిత్ శెట్టి సింగమ్ ఎగైన్ సినిమా రిలీజ్ కు అదే సమయంలో రెడీ అవుతోంది. ఇది ఓ భారీ మల్టీ స్టారర్.  బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ రోహిత్‌ శెట్టి (Rohit Shetty) సినిమాల్లో ‘సింగం’(Singham) సిరీస్‌కు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సిరీస్‌లో తెరకెక్కిన రెండు సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు సింగం-3 (Singham Agian) తెరకెక్కబోతుంది.  అజయ్‌ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే, టైగ‌ర్ ష్రాఫ్, రణ్‌వీర్ సింగ్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇక  సినిమా నుంచి దీపికాతో పాటు, టైగ‌ర్ ష్రాఫ్(Tiger Shroff), రణ్‌వీర్ సింగ్ ఫస్ట్‌లుక్‌ల‌ను విడుదల చేయ‌గా.. ఫ్యాన్స్‌కు   తెగ నచ్చేసాయి. ఈ సినిమా ఖచ్చితంగా పుష్ప 2 కు హిందీ బెల్ట్ లో ఓ రేంజిలో పోటీ ఇస్తుందంటున్నారు. 

పుష్ప 2 కు పోటీ ఇచ్చే ..మరో చిత్రం తమిళ్ నుంచి దళపతి విజయ్ మరియు దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం “గోట్”(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం). ఈ సినిమా ఆగస్ట్ లోనే రిలీజ్ ఉండబోతోంది. హిట్టైందంటే ఖచ్చితంగా తమిళ బెల్ట్ లో పుష్ప 2 కు పోటీ ఇస్తుంది.  టైం ట్రావెల్ కాన్సెప్ట్‌ తో పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు వెంకట్‌ ప్రభు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్‌ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేసే విధంగా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో విజయ్ కి జోడీగా హీరోయిన్ గా నటించబోతున్నారు. కాగా జయరామ్‌, స్నేహా, యోగి బాబు, అజ్మల్‌ అమీర్‌, మైక్ మోహన్‌, వైభవ్‌ ఇంకా ప్రముఖ నటీ నటులు కూడా ది గోట్ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించబోతున్నట్లు నిర్మాతలు సినిమా పూజ కార్యక్రమం రోజే ప్రకటించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. రజనీకాంత్ వెట్టై కూడా ఈ ఆగస్ట్ లోనే వస్తుందంటున్నారు. 
 
పుష్ప 2 విషయానికి వస్తే ...ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఒకేసారి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే వ్యూహంతో నిర్మాణం చేపడుతున్నారు. ఫస్ట్ పార్ట్  సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. భాషతో సంబంధం లేకుండా పుష్ప మేనరిజమ్‌తోనూ, డైలాగ్‌తోనూ ప్రపంచం మొత్తం ఊగిపోయింది. ఆ రెస్పాన్స్ ని దృష్టిలో ఉంచుకునే కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప: ది రూల్‌’ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్  తో తెరకెక్కించడంతోపాటు, ఒకేసారి  పలు భాషల్లో విడుదల చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు నిర్మాతలు.  ఈ క్రమంలో కేవలం తెలుగు రెండు రాష్ట్రాల నుంచే 200 కోట్ల దాకా బిజినెస్ ఎక్సపెక్ట్ చేస్తున్నట్లు  తెలుస్తోంది. RRR చిత్రం తెలుగులో రెండువందల కోట్లు బిజినెస్ చేసింది. ఇప్పుడు పుష్ప 2 కూడా అలాగే చేయాలని లెక్కలేసుకుని నిర్మాతలు రంగంలోకి దిగినట్లు ఫిల్మ్ నగరవర్గాల సమాచారం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?