అబ్బురపరిచే సెట్ లో సమంత అందాల విందు.. ఐటమ్ సాంగ్ లో నెవర్ బిఫోర్ అనిపించేలా

pratap reddy   | Asianet News
Published : Nov 22, 2021, 09:34 AM IST
అబ్బురపరిచే సెట్ లో సమంత అందాల విందు.. ఐటమ్ సాంగ్ లో నెవర్ బిఫోర్ అనిపించేలా

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రంలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్ లతో ఉన్న సాన్నిహిత్యంతో సమంత ఐటెం నంబర్ కు ఓకె చెప్పింది.

సమంత క్రేజ్ మరోసారి బయట పడుతోంది. నటన, గ్లామర్ తో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా సమంత దూసుకుపోతోంది. నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత ఎక్కువగా వార్తల్లో నిలిచింది.  ఇంతటి క్రేజ్ ఉన్న సమంత తన కెరీర్ లో ఒక్కసారి కూడా ఐటమ్ సాంగ్ చేయలేదు. తొలిసారి సమంత ఐటమ్ నంబర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఐకాన్ స్టార్ Allu Arun నటిస్తున్న పుష్ప చిత్రంలో Samantha స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్ లతో ఉన్న సాన్నిహిత్యంతో సమంత ఐటెం నంబర్ కు ఓకె చెప్పింది. ఇప్పటికే పుష్ప చిత్రంపై భారీ హైప్ నెలకొంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ప్రతి సాంగ్ సూపర్ హిట్ గా నిలుస్తోంది. దేనితో అభిమానులు ప్రస్తుతం సమంత మాస్ ఐటెం సాంగ్ కూడా వెయిట్ చేస్తున్నారు. 

మేకర్స్ కూడా సమంత, అల్లు అర్జున్ ల క్రేజ్ దృష్టిలో ఉంచుకుని నెవర్ బిఫోర్ అనిపించే విధంగా స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం అబ్బురపరిచే సెట్ నిర్మించే పనిలో ఆర్ట్ డిపార్ట్మెంట్ బిజీగా ఉంది. సమంత గ్లామర్, మాస్ స్టెప్పులు ఈ సాంగ్ లో హైలైట్ గా నిలిచేలా ప్లాన్ చేసుకుంటున్నారట సుకుమార్. 

ప్రస్తుతం సమంత చెన్నైలో ఉంది. ఆమె తిరిగిరాగానే రెండు రోజుల పాటు రిహార్సల్స్ సెషన్ ఉంటుందట. ఆ తర్వాత నవంబర్ 28న సాంగ్ షూట్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు సాంగ్ తిరుగులేని మాస్ బీట్ గా అలరిస్తుందని ఇప్పటికే పుష్ప యూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం బన్నీ అభిమానులంతా ఈ ఐటెం సాంగ్, పుష్ప ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 17న పుష్ప చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ సరసన ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో థ్రిల్లింగ్, యాక్షన్ ఎలిమెంట్స్ లో సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nayanthara House: 31 కోట్లతో 4BHK ఇల్లు, పోయెస్ గార్డెన్‌లో నయనతార కొత్త కాపురం?
Gaddar Film Awards List: ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ నటుడు నాగచైతన్య.. రాజు వెడ్స్ రాంబాయికి అవార్డుల పంట