అఫీషియల్ : 'పుష్ప' రిలీజ్ డేట్ ఫిక్స్.. ముందుకొచ్చి కొట్టబోతున్న బన్నీ

pratap reddy   | Asianet News
Published : Oct 02, 2021, 10:08 AM ISTUpdated : Oct 02, 2021, 10:10 AM IST
అఫీషియల్ : 'పుష్ప' రిలీజ్ డేట్ ఫిక్స్.. ముందుకొచ్చి కొట్టబోతున్న బన్నీ

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా పుష్ప చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో అడవుల్లో సాగే ఉత్కంఠ భరితంగా సాగే కథగా సుకుమార్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా పుష్ప చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో అడవుల్లో సాగే ఉత్కంఠ భరితంగా సాగే కథగా సుకుమార్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. అల్లు అర్జున్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ఇది. 

రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్ర పార్ట్ 1.. పుష్ప ది రైజ్ రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ముందుగా ఈ చిత్రాన్ని క్రిస్టమస్ వీక్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ పాండమిక్ పరిస్థితులు కొద్దికొద్దిగా చక్కబడుతుండడంతో ఇతర భారీ చిత్రాలు కూడా తమ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. 

దీనితో పుష్ప మేకర్స్ కూడా తమ రిలీజ్ ప్లాన్స్ చేంజ్ చేసుకుని డిసెంబర్ 17నే పుష్ప ది రైజ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అనుకున్న సమయాని కంటే ముందుకు వచ్చి మరీ అల్లు అర్జున్ బాక్సాఫీస్ ని కొట్టబోతున్నాడు. పుష్ప రిలీజ్ డేట్ ప్రకటించడంతో ఈ చిత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 

మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందన శ్రీవల్లిగా అలరించబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. తెలుగుతో పాటు ఈ చిత్రం తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. 

 

PREV
click me!

Recommended Stories

అనిల్ రావిపూడి కి హీరోగా ఆఫర్ వస్తే.. ఏమన్నాడో తెలుసా? స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
Karthika Deepam 2 Today Episode: నిజం దాచిన కార్తీక్- చావు దగ్గర పడినట్లు మాట్లాడిన సుమిత్ర