నేడు ప్రైమ్ వీడియోలో అల్లు అర్జున్ 'పుష్ప'.. భలే కలిసొచ్చిందే

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 07, 2022, 12:15 PM ISTUpdated : Jan 07, 2022, 01:11 PM IST
నేడు ప్రైమ్ వీడియోలో అల్లు అర్జున్ 'పుష్ప'.. భలే కలిసొచ్చిందే

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' చిత్రం డిసెంబర్ 17న భారీ అంచనాల నడుమ విడుదలయింది. అంచనాలని అందుకోవడంలో ఈ చిత్రం విఫలమైంది. కానీ అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ కి మాత్రం సర్వత్రా ప్రశంసలు దక్కాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' చిత్రం డిసెంబర్ 17న భారీ అంచనాల నడుమ విడుదలయింది. అంచనాలని అందుకోవడంలో ఈ చిత్రం విఫలమైంది. కానీ అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ కి మాత్రం సర్వత్రా ప్రశంసలు దక్కాయి. సౌత్ లో ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కలేదు. నార్త్ లో మాత్రం పుష్ప అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. 

ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ కారణంగా భారీ చిత్రాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఆ విషయంలో పుష్ప చిత్రానికి బాగా కలసి వచ్చిందనే చెప్పాలి. దాదాపు 20 రోజులకు పైగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించింది. కరోనా కేసులు పెరుగుతున్న టైంలో అమెజాన్ ప్రైమ్ పుష్ప చిత్రంతోభారీ డీల్ కుదుర్చుకుంది. 

దీనితో పుష్ప చిత్రం నేటి నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. జనవరి 7, రాత్రి 8 గంటల నుంచి పుష్ప చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ మొదలు కానుంది. అలా బాక్సాఫీస్ రన్ ముగుస్తున్న టైంలో ఇలా పుష్ప ప్రైమ్ వీడియోలోకి ఎంటర్ కానుంది. ఈ విషయంలో పుష్ప చిత్రానికి బాగా కలసి వచ్చిందనే చెప్పాలి. 

తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలకు అమెజాన్ సంస్థ పుష్ప ఓటిటి హక్కులు దక్కించుకుంది. దీనితో ఓటిటిలో పుష్ప ఎలాంటి స్పందన దక్కించుకుంటుందో చూడాలి. పుష్ప చిత్రం నిరాశపరిచినప్పటికీ కొన్ని సన్నివేశాలు అద్భుతంగా అలరించాయి. అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ మధ్య అసలు వార్ పార్ట్ 2లో ఉండనుంది. దీనితో పార్ట్ 2 పుష్ప ది రూల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Venu Swamy: పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టిన వేణు స్వామి, సీఎం పోస్ట్ పై సంచలన జోస్యం
Pawan Kalyan: చివరి కోరిక తీరకుండానే పవన్ ఫ్యాన్ మృతి..ఆ కుటుంబానికి అండగా సోనూసూద్