Pushpa: 'ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా' అంటూ వచ్చేస్తున్న బన్నీ.. మరో ఊర మాస్ గెటప్ లో ఐకాన్ స్టార్

pratap reddy   | Asianet News
Published : Nov 14, 2021, 10:49 AM IST
Pushpa: 'ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా' అంటూ వచ్చేస్తున్న బన్నీ.. మరో ఊర మాస్ గెటప్ లో ఐకాన్ స్టార్

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' చిత్రంపై ఒక రేంజ్ లో హైప్ ఉంది. డిసెంబర్ 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'Pushpa' చిత్రంపై ఒక రేంజ్ లో హైప్ ఉంది. డిసెంబర్ 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, బన్నీ కాంబినేషన్ కావడంతో.. పైగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. 

విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ పాటలు యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. తొలిసారి Allu Arjun రగ్గడ్ లుక్ లో, ఊర మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ పుష్ప చిత్రంలోని నాల్గవ పాట అప్డేట్ ఇచ్చింది. 

'ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా' అంటూ సాగే పాటని నవంబర్ 19న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీని కోసం విడుదల చేసిన పోస్టర్ బన్నీ అభిమానులకు సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ మరో డిఫెరెంట్ లుక్ లో మాస్ స్టైల్ లో అదరగొడుతున్నాడు. ఒక డాన్ తరహాలో బన్నీ ఇస్తున్న ఫోజు కిక్కిచ్చేలా ఉంది. 

Also Read: నా భర్తగా అతడా.. వద్దనే వద్దు అంటున్న నయనతార ?

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రతి పాట సూపర్ హిట్ అవుతుండడంతో చిత్ర యూనిట్ హ్యాపీగా ఉంది. బన్నీ నుంచి సాంగ్ వస్తే యూట్యూబ్ లో రికార్డులు మోతెక్కుతున్నాయి. మరి నాల్గవ సాంగ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. బన్నీకి జోడిగా రష్మిక మందన నటిస్తోంది. ఎర్రచందనంని అక్రమంగా తరలించే లారీ డ్రైవర్ గా ఉండే పుష్పరాజ్.. స్మగ్లింగ్ సామ్రాజ్యానికి డాన్ గా మారుతాడా ? బహుశా అయిఉండొచ్చు.. ఈ పోస్టర్ ని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. 

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Janhvi Kapoor: పెద్ది రిలీజ్ తర్వాత 2 వారాలు సైలెంట్.. ఎట్టకేలకు యాక్టివ్, నిజంగానే జాన్వీకి నచ్చలేదా ?
Super Star Krishna: కృష్ణతో రొమాంటిక్ సీన్, వెళ్లి దున్నేసేయ్ అని ఆయన భార్యే అన్నారు.. హీరోయిన్ కామెంట్స్