నా భర్తగా అతడా.. వద్దనే వద్దు అంటున్న నయనతార ?

pratap reddy   | Asianet News
Published : Nov 14, 2021, 10:00 AM IST
నా భర్తగా అతడా.. వద్దనే వద్దు అంటున్న నయనతార ?

సారాంశం

సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార మిగిలిన హీరోయిన్లందరికీ ఓ మిస్టరీ. సాధారణంగా వయసు పెరిగేకొద్దీ హీరోయిన్ల క్రేజ్ తగ్గుతూ వస్తుంది. కానీ విచిత్రంగా నయనతార క్రేజ్ మాత్రం స్టార్ హీరోలని సైతం తలదన్నేలా పెరుగుతూనే ఉంది.

సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార మిగిలిన హీరోయిన్లందరికీ ఓ మిస్టరీ. సాధారణంగా వయసు పెరిగేకొద్దీ హీరోయిన్ల క్రేజ్ తగ్గుతూ వస్తుంది. కానీ విచిత్రంగా నయనతార క్రేజ్ మాత్రం స్టార్ హీరోలని సైతం తలదన్నేలా పెరుగుతూనే ఉంది. నయనతార ప్రస్తుతం సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్. 

సీనియర్ హీరోల పక్కన ఒదిగిపోయే అభినయం..కుర్ర హీరోలతో రొమాన్స్ చేస్తే అందం Nayanthara సొంతం. ఇదిలా ఉండగా నయనతార నిర్మాతలకు తన రెమ్యూనరేషన్, ఇతర డిమాండ్స్ తో చుక్కలు చూపిస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. మరోసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది. ఈసారి నయనతార ఏకంగా మెగాస్టార్ చిరంజీవి 'GodFather' చిత్రానికే సమస్యగా మారిందట. 

మలయాళంలో ఘనవిజయం సాధించిన 'లూసిఫెర్' చిత్రాన్ని తెలుగులో చిరంజీవి 'గాడ్ ఫాదర్' గా రీమేక్ చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకుడు. ఈ చిత్రంలో ముఖ్యమంత్రి కుమార్తె పాత్ర చాలా కీలకం. ఆ పాత్రలో మలయాళంలో మంజు వారియర్ నటించారు. ఆమె భర్త పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించడం విశేషం. 

Also Read: National Crush: రష్మిక మందన్నాకి నిధి అగర్వాల్ దిమ్మతిరిగే షాక్‌‌.. పవన్‌ కళ్యాణ్‌ని చూసుకునేనా ఈ దూకుడు?

ఇక మంజు వారియర్ పాత్ర కోసం తెలుగులో నయనతారని ఫైనల్ చేశారు. ఇక నయన్ భర్త రోల్ కోసం క్రేజీ నటుడు సత్యదేవ్ ని డైరెక్టర్ మోహన్ రాజా ఎంపిక చేశారట. ఆ రోల్ కి సత్యదేవ్ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాడని అంతా భావిస్తున్నారు. కానీ నయనతార మాత్రం సమస్య సృష్టిస్తోందని టాక్. తన భర్త రోల్ లో సత్యదేవ్ వద్దని అంటోందట. సత్యదేవ్ నా భర్తగా నటించేంత పాపులర్ స్టార్ కాదని..  కొంచెం ఇమేజ్ ఉన్న నటుడ్ని ఆ రోల్ కోసం సెలెక్ట్ చేసుకోవాలని నయనతార దర్శకుడికి తేల్చి చెప్పేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే గాడ్ ఫాదర్ చిత్రానికి నయన్ పారితోషికం కూడా అందుకుంది. సత్యదేవ్ ని కూడా ఫైనల్ చేసేశారు. ఈ తరుణంలో నయన్ డిమాండ్ దర్శకుడికి తలనొప్పి వ్యవహారంలా మారింది. నయనతారని ఎలాగైనా కన్విన్స్ చేసే ప్రయత్నంలో డైరెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. నయనతార చివరగా చిరంజీవి సరసన సైరా చిత్రంలో నటించింది. 

PREV
click me!

Recommended Stories

2025 Flop Heroines: 2025లో ఫ్లాప్ సినిమాలతో పోటీ పడ్డ హీరోయిన్లు.. వాళ్ళిద్దరికీ మూడేసి డిజాస్టర్లు
Sobhan babu జీవితాన్ని ఒక్క సినిమాతో నిలబెట్టిన ఎన్టీఆర్, ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా?