'పుష్ప' టీజర్ ని ఏ లాంగ్వేజ్ లో ఎక్కువగా చూశారో తెలుసా? తెలుగైతే కాదు

Published : Apr 08, 2023, 01:56 PM IST
 'పుష్ప' టీజర్  ని ఏ లాంగ్వేజ్ లో ఎక్కువగా చూశారో తెలుసా? తెలుగైతే కాదు

సారాంశం

సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్‌ రికార్డు షురూ అయ్యాయి. ఐకాన్ స్టార్ పుట్టిన రోజు కానుకగా  రిలీజ్ చేసిన కాన్సెప్ట్‌ వీడియో యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.


  శుక్రవారం విడుదలైన పుష్ప 2 సినిమా టీజర్‌ వీడియో యూట్యూబ్‌లో సంచలనాలను నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ టీజర్‌ విడుదలైన 18 గంటల్లోనే 21 మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీన్ని బట్టే  తెలిసిపోతుంది.. పుష్ప 2కు ఉన్న క్రేజ్‌ ఏంటో. పుష్ప 2 సినిమా మొదటి భాగం కంటే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుందని ప్రత్యేకంగా అంచనాలు వేయాల్సిన పనిలేదు. 3 నిమిషాల నిడివి ఉన్న పుష్ప సినిమా టీజర్‌లో కేవలం గొడవలు, పుష్ప మాస్‌ ఎంట్రీని మాత్రమే చూపించి రచ్చ చేసారు. ఈ టీజర్ ని బట్టి చూస్తే పుష్పరాజ్‌..రాబిన్ హుడ్ అవతారం ఎత్తాడని అజ్ఞాతంలోకి వెళ్లిపోయి తిరిగి వస్తాడన్న సంగతి అర్థం తెలుస్తోంది. ఇక పుష్ప టీజర్ ని ఏ లాంగ్వేజ్ వాళ్లు ఎక్కువ మంది చూసారంటే..

ఈ టీజర్ తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్ అత్యధిక వ్యూస్ సంపాదించింది తెలుగులో కాదు. టాలీవుడ్ తరువాత అల్లు అర్జున్ కి మలయాళంలో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది.  అయితే ఈ రెండు చోట్లా ని రికార్డ్ బ్రద్దలు కొట్టే వ్యూస్ హిందీలో వస్తున్నాయి. అన్ని భాషల్లో కంటే హిందీ లాంగ్వేజ్ లో ఎక్కువ వ్యూస్ సంపాదించింది. తెలుగులో ఇప్పటి వరకు ఈ టీజర్ కి 18 మిలియన్ల వ్యూస్ రాగా, హిందీలో ఏకంగా 21 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం. వీటి తరువాత తమిళంలో 1.6 మిలియన్, మలయాళంలో 727K, కన్నడలో 555K వ్యూస్ అందుకుంది. ఈ వ్యూస్ బట్టి చూస్తుంటే పుష్పకి సౌత్ లో కంటే నార్త్ లో ఎక్కువ క్రేజ్ ఉన్నట్లు తెలుస్తుంది.

మరో ప్రక్క ఈ మూడు నిమిషాల టీజర్ లో  సినిమాలో ప్రధాన పాత్ర అయిన హీరోయిన్‌ ప్రస్తావన ఎక్కడా రాకపోవటం కూడా హాట్ టాపిక్ గా మారింది.ఈ విషయం ఆధారం చేసుకుని రాబోయే సినిమాలో శ్రీవల్లి చనిపోబోతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇక, శ్రీవల్లి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటం చుట్టే సెకండ్‌ హాఫ్‌ నడవబోతోందని సోషల్ మీడియా జనం చర్చించుకుంటున్నారు.   మొదటి భాగంలో సునీల్, అజయ్ ఘోష్ విలన్స్ గా కనిపించగా రెండో భాగంలో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్