ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో తెలిసిందే. తాజాగా వైజాగ్ లో నిర్వహించి ఓ ప్రొగ్రామ్ ను ఫ్యాన్స్ దెబ్బకు రద్దు చేయాల్సి వచ్చింది. ఇంతకీ అంతలా అభిమానులు ఏం చేశారంటే..
ఇప్పటికే తెలుగుతోపాటు కన్నడలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న బన్నీకి... ‘పుష్ప’తో ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక ముఖ్యంగా వైజాగ్ లో బన్నీ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు అల్లు అర్జున్ విశాఖపట్నం వెళ్లిన అభిమానులు ఘనంగానే స్వాగతం పలుకుతుంటారు. ఇక కొద్దిరోజుల కింద ‘పుష్ప2’ (Pushpa 2) షూటింగ్ కోసం అల్లు అర్జున్ సహా మూవీ యూనిట్ వైజాగ్ కు చేరుకున్న విషయం తెలిసిందే. అప్పుడు బన్నీని ఘనంగా స్వాగతించారు. ర్యాలీలు నిర్వహించి, పూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా అభిమానులను ఖుషీ చేసేందుకు తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో ఫొటోషూట్ కార్యక్రమాన్ని వైజాగ్ లో నిర్వహించారు. మామూలు ఈవెంట్లలోనే బన్నీ ఎంట్రీకి వేదిక దద్దరిల్లిపోతుంది. ఇక తమ ప్రాంతంలో అభిమాన హీరోను కలిసే అవకాశం రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే కొందరు అత్యుత్సాహానికి పోవడంతో కార్యక్రమం గందరగోళంగా మారింది. ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం అసాధ్యంగా మారడంతో ఫొటోషూట్ నే రద్ధు చేసినట్టు తెలుస్తోంది.
అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం కాస్తా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బన్నీని దగ్గర్నుంచి చేస్తామనే ఆశతో వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురవడంతో అప్సెట్ అవుతున్నారు. దీంతో గీతా ఆర్ట్స్ మరియు అల్లు అర్జున్ డిజిటల్ అండ్ కంటెంట్ హెడ్ శరత్ చంద్రను ట్వీటర్ లో ట్యాగ్ చేస్తూ ‘ఏంటీదంటూ’ ప్రశ్నిస్తున్నారు. ‘రెండు మూడేండ్ల నుంచి ఇదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడియె ఫంక్షన్, సక్సెస్ మీట్, ఇప్పుడు ఫ్యాన్స్ మీట్ లోనూ అదే జరిగింది. అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకోవద్దు’ అని ఆవేదన చెందారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో ‘పుష్ప : ది రైజ్’ వచ్చిన విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగర్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. మరోవైపు చిత్రంలోని డైలాగ్స్, పుష్పరాజ్ అటిట్యూడ్, సాంగ్స్, యాక్షన్ సీన్స్ అదిరిపోయిన విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ ఫిల్మ్ గా విడుదలైన ఈ చిత్రానికి నార్త్ లోనూ మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ‘పుష్ఫ2’ షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. రష్మిక మందన్న హీరరోయిన్ గా నటిస్తోంది. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, తదితరులు నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
VizAAg Fans Meet Got Cancelled 🥺💔
Anti Anna idi 🥺
It's Not The First Time.🥺
It's Repeating From 2-3 Yrs
We're Not Happy With AUDIO Launch, SUCCESS Meet & FANS Meet
Don't Play With Fans Emotions pic.twitter.com/BMHAHv3fiQ