అల్లు అర్జున్ కొత్త కథల ఎంపికల విషయంలో కొత్త రూల్‌ని ఫాలో అవుతున్నారట. దీంతో ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా కంటే ఆ డైరెక్టర్‌తోనే మూవీ ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప 2` వివాదంతో ఇంకా బయటపడలేదు. కానీ పరిస్థితులు చూస్తుంటే దీన్నుంచి ఆయన త్వరగానే బయటపడతాడనిపిస్తుంది. ప్రభుత్వ పరంగా రాజీ వ్యవహారాలు నడిచినట్టు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఆయన త్వరలోనే ఈ కేసు నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
`పుష్ప 2` రిలీజ్‌కి ముందు రోజు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఓ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలోనే బన్నీపై కేసు నమోదు చేశారు. ఇందులో అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు బన్నీ. నేడు బెయిల్ పిటీషన్ విచారణ జరగబోతుంది.
బన్నీ నటించిన `పుష్ప 2` భారీ కలెక్షన్లని సాధిస్తుంది. సుకుమార్ రూపొందించిన ఈ మూవీ ఆల్మోస్ట్ 1800కోట్లు వసూలు చేసింది. ఇండియన్ మార్కెట్‌లో 800 కోట్ల నెట్ ని వసూలు చేసి అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
ఈ లెక్కన ఇది `బాహుబలి 2`, `దంగల్` చిత్రాల రికార్డులను బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. సంక్రాంతి వరకు ఈ మూవీ రన్ అవుతూనే ఉంటుంది. మున్ముందు మరిన్ని కలెక్షన్లు వస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమాకి సౌత్ కంటే నార్త్ లోనే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని తెలిసిందే. చాలా రోజుల క్రితమే దీన్ని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు.
ప్రస్తుతం అల్లు అర్జున్ ఉన్న పరిస్థితుల్లో ఆయన కొంత కాలం రిలాక్స్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇంకా నెల, రెండు నెలలు ఆయన మరే సినిమాపై వర్క్ చేసే ఆసక్తి లేదని సమాచారం. ఈ క్రమంలో బన్నీ నెక్ట్స్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
అంతా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మూవీని మైథలాజికల్ టచ్‌తో భారీ మూవీగా తెరకెక్కించబోతున్నట్టు, ఇండియన్ సినిమాలో, మన తెలుగు సినిమాలో ఇలాంటి జోనర్ రాలేదని నిర్మాత నాగవంశీ చెప్పారు. భారీస్థాయిలో ఈ సినిమా ఉంటుందన్నారు.
ప్రస్తుతం ఈ కథపై త్రివిక్రమ్ వర్క్ చేస్తున్నారట. అయితే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదని సమాచారం. త్రివిక్రమ్ టీమ్ ఇంకా వర్క్ చేస్తుందట. దీంతో బన్నీ నుంచి దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ రాలేదని సమాచారం.
మరోవైపు తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్(జైలర్ ఫేమ్)తోనూ సినిమా చేయాల్సి ఉందట. ఆయన కూడా అల్లు అర్జున్‌కి కథ చెప్పారని, ఆయన కూడా ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. దీంతోపాటు అట్లీతోనూ సినిమా క్యాన్సిల్ కాలేదని, ఆ ప్రాజెక్ట్ కూడా ఉంటుందని సమాచారం. అయితే అట్లీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లతో కలిసి సినిమా ప్లాన్ చేస్తున్నారట. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మరోవైపు సందీప్ రెడ్డి వంగాతోనూ ఓ మూవీ చేయాల్సి ఉంది బన్నీ. కానీ దీనికి చాలా టైమ్ పడుతుంది.
అయితే స్క్రిప్ట్ ఫైనల్ చేసే విషయంలో నెల్సన్ ఫాస్ట్ గా ఉన్నాడని తెలుస్తుంది. త్రివిక్రమ్ కంటే ముందుగా నెల్సన్ సినిమా ఓకే అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కొత్త సినిమాలు ఫైనల్ చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారట. బౌండెడ్ స్క్రిప్ట్ ఓకే అయిన తర్వాతనే, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఓకే అయినా తర్వాతనే ఓకే చెబుతున్నారట. అది పెద్ద డైరెక్టరా? చిన్న డైరెక్టరా? అనేది చూడటం లేదని, తనకు క్లోజ్ అయినా, కాకపోయిన కథల ఎంపికలు, స్క్రిప్ట్ ఫైనల్ చేయడం,
సినిమాని స్టార్ట్ చేయడానికి సంబంధించి ఇలా అన్ని విషయాల్లోనూ చాలా కేరింగ్‌గా ఉంటున్నాడని, అన్ని రకాలుగా ఓకే అయితేనే సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని, అలా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మూవీని ప్రకటించడానికి రెడీగా లేడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బన్నీ నెక్ట్స్ సినిమా ఎవరితో ఉంటుందనేది పెద్ద సస్పెన్స్ గా మారింది.
read more:బాలకృష్ణ ఊర్వశి బట్టలు ఉతుకుతున్నాడా? `డాకు మహారాజ్` సాంగ్, శేఖర్ మాస్టర్‌పై క్రేజీ ట్రోల్స్
also read: అత్యధిక వసూళ్లని రాబట్టిన టాప్ 8 రామ్ చరణ్ సినిమాలు