కేరళ ఫ్యాన్స్ కోసం బన్నీ రిక్వెస్ట్..

Published : Apr 19, 2019, 01:12 PM IST
కేరళ ఫ్యాన్స్ కోసం బన్నీ రిక్వెస్ట్..

సారాంశం

  నా పేరు సూర్య అనంతరం అల్లు అర్జున్ ఫైనల్ గా మూడు ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. మొదట త్రివిక్రమ్ సినిమాను ఫినిష్ చేసి ఆ తరువాత వేణు శ్రీరామ్ - సుకుమార్ ప్రాజెక్టులను పూరి చేయాలనీ చూస్తున్నాడు

నా పేరు సూర్య అనంతరం అల్లు అర్జున్ ఫైనల్ గా మూడు ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. మొదట త్రివిక్రమ్ సినిమాను ఫినిష్ చేసి ఆ తరువాత వేణు శ్రీరామ్ - సుకుమార్ ప్రాజెక్టులను పూరి చేయాలనీ చూస్తున్నాడు. అసలు విషయంలోకి వస్తే కేరళలో బన్నీకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

మల్లూ స్టార్ అని మలయాళం అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. అయితే మలయాళంలో ఒక డైరెక్ట్ సినిమా తప్పకుండా చేస్తాను అని గత కొంత కాలంగా చెబుతున్న బన్నీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అయితే మల్లు ఫ్యాన్స్ కోసం అక్కడి యాక్టర్స్ ని తన సినిమాలో వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మలయాళం ఫెమస్ యాక్టర్ జయరాం త్రివిక్రమ్ - బన్నీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

త్రివిక్రమ్ రాసుకున్న కథలో స్పెషల్ పాత్రకు నటులను వెతుకుతుండగా బన్నీ జయరామ్ ని తీసుకోవాలని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. పరభాషా సీనియర్ నటులను అద్భుతంగా వాడుకునే మాటల మాంత్రికుడికి జయరాం లాంటి నటుడు దొరికితే ఆడియెన్స్ కి సరికొత్తగా ప్రజెంట్ చేస్తాడని చెప్పవచ్చు.  ఇక సినిమాకు దర్శకుడు అలకనంద అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?