రేవంత్‌ రెడ్డి ముందు అల్లు అర్జున్‌ మాస్‌ డైలాగ్‌.. సీఎం రియాక్షన్‌ ఇదే.. గద్దర్‌ ఫిల్మ్ అవార్డుల్లో అరుదైన దృశ్యం

Published : Jun 14, 2025, 10:13 PM IST
allu arjun, cm revanth reddy

సారాంశం

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు 2024 ప్రదానోత్సవంలో అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడిగా అవార్డుని అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాస్‌ డైలాగ్‌తో ఉర్రూతలూగించారు. 

తెలంగాణ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు ప్రదాన వేడుక శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని హైటెక్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. 

ఇందులో పలువురు విజేతలకు ఆయన అవార్డులు ప్రదానం చేశారు. అందులో భాగంగా 2024 ఏడాదికిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ అందుకున్నారు. `పుష్ప 2` చిత్రానికిగానూ బన్నీ ఈ పురస్కారం గెలుచుకున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా ఈ గద్దర్‌ ఫిల్మ్ అవార్డుని అందుకున్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన బన్నీ 

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడారు. `ఇలాంటి ప్రతిష్టాత్మక గద్దర్‌ అవార్డులను అందించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇదొక గొప్ప ప్రయత్నం. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి అన్నగారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, దిల్‌ రాజుగారికి అందరికి ధన్యవాదాలు.

ఈ అద్బుతానికి కారణమైన దర్శకుడు సుకుమార్‌కి ధన్యవాదాలు. ఈ అవార్డు రావడం పూర్తిగా మీ విజన్‌ వల్లే సాధ్యమైంది. అలాగే నా నిర్మాతలు, ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లకి ధన్యవాదాలు.

రాజమౌళికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్‌

ఈ సందర్భంగా రాజమౌళిగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు ఆ రోజు `పుష్ప` చిత్రాన్ని హిందీ రిలీజ్‌ చేయమని చెప్పకపోతే ఇంతటి విజయం ఉండేది కాదు. మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నా. `పుష్ప 2` సినిమా గెలిచిన మొదటి అవార్డు ఇది.

 ఈ పురస్కారాన్ని నా అభిమానులకు అంకితమిస్తున్నా. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలి, అదే సమయంలో మిమ్మల్నిఎప్పుడూ గర్వపడేలా చేస్తాను` అని తెలిపారు బన్నీ.

`పుష్ప 2` చిత్రంలోని మాస్‌ డైలాగ్‌తో అల్లు అర్జున్‌ రచ్చ

ఈ సందర్భంగా `పుష్ప2` సినిమాలోని డైలాగ్‌ని స్టేజ్‌పై చెప్పి ఆశ్చర్యపరిచారు. `ఆ బిడ్డమీద ఒక్క గీటు పడ్డ గంగమ్మ జాతరలో యాట తలనరికినట్టు రఫ్ఫా రఫ్ఫా నరుకుతా ఒక్కొక్కడిని. పుష్ప, పుష్పరాజ్‌ అస్సలు తగ్గేదెలే` అంటూ మాస్‌ డైలాగ్‌ చెప్పి ఉర్రూతలూగించారు బన్నీ. సీఎం రేవంత్‌ రెడ్డి ముందు ఆయన ఈ డైలాగ్‌ చెప్పడం విశేషం. దీన్ని సీఎం కూడా ఎంజాయ్‌ చేశారు. నవ్వుతూ కనిపించడం విశేషం.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు
Ileana: ప్రభాస్‌, మహేష్‌, తారక్‌, రవితేజ గురించి ఇలియానా ఒక్క మాటలో