'గారూ' అంటూ బన్ని గాండ్రింపు

Published : Dec 18, 2018, 09:17 AM IST
'గారూ'  అంటూ బన్ని గాండ్రింపు

సారాంశం

"శర్వా  నాకంటే చిన్నోడు. పార్టీలో కలుస్తుంటాం. కానీ శర్వాగారు అంటాను. ఆయన చేసిన సినిమాలు, ఆయనకీ గౌరవం, స్థాయిని తెచ్చాయి. 

 "శర్వా  నాకంటే చిన్నోడు. పార్టీలో కలుస్తుంటాం. కానీ శర్వాగారు అంటాను. ఆయన చేసిన సినిమాలు, ఆయనకీ గౌరవం, స్థాయిని తెచ్చాయి. అందుకే గారు అంటున్నాను. ఈ మధ్యలో టీవీల్లోను, సమాజంలో సినిమా, రాజకీయ నాయకులని కూడా పేర్లు పెట్టి పిలిచేస్తున్నారు. ‘గారు’ అని ఒక గౌరవం ఇవ్వండి. 

ఒకసారి టీవీలో చూస్తుంటే ఎవరో చిరంజీవిని పిలు అన్నారు. చిరంజీవి ఏంట్రా? చిరంజీవిగారు, పవన్‌ కళ్యాణ్‌గారు. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా గౌరవించాలి. వినడానికి  కొంచెం ఆర్టిఫీఫియల్‌గా ఉన్నా మంచి విషయం కాబట్టి అలవాటు చేసుకోండి...అంటూ బాగానే కోటింగ్ ఇచ్చాడు బ‌న్ని.

`ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ మాట్లాడుతూ ఇలా గారు మీద గాండ్రించటం .  ఫిలింన‌గ‌ర్‌లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. అలాగే  ఇదే వేదిక‌పై శ‌ర్వానంద్‌ని ఉద్ధేశించి గారు అని పిలిచాడు బ‌న్ని. శ‌ర్వానంద్ గారు అని  పిల‌వ‌డానికి కార‌ణం మీరంతా త‌న‌ని గుండెల్లో పెట్టుకుని ఇంత పెద్ద వాడిని చేసి గౌర‌వించారు. అందుకే వేదికాముఖంగా గారు అని పిలుస్తున్నాను. ఇది మ‌నం నేర్చుకుందాం.. అని ప్రాక్టికాలిటీని చూపించాడు అల్లు అర్జున్.

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?
Director KK Passed Away: నాగార్జున `కేడి` మూవీ డైరెక్టర్‌ కన్నుమూత.. సందీప్‌ రెడ్డి వంగాకి ఈయనే గురువు