అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా డబ్బులివ్వలేదట, అల్లు అరవింద్ పై ఐకాన్ స్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..

Published : Dec 24, 2023, 05:55 PM ISTUpdated : Dec 24, 2023, 05:58 PM IST
అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా డబ్బులివ్వలేదట, అల్లు అరవింద్ పై ఐకాన్ స్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..

సారాంశం

అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ ఫోస్ట్ పెట్టాడు. తన మొదటి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ సీక్రేట్ ను బయట పెట్టాడు బన్నీ. తన తండ్రి అల్లు అరవింద్ పై ఐకాన్ స్టార్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమంటున్నారంటే. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన బన్నీ.. నెక్ట్స్ అంతకు మించి సాధించడానికి పుష్ప2 విషయంలో గట్టిగా కష్టపడుతున్నాడు. ఇక పుష్పతో జాతీయ అవార్డ్ సాధించి అల్లు అర్జున్.. గతంలో 40 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటే.. అది ఇప్పుడు 100 కోట్లు దాటిందని సమాచారం. ఈక్రమంలో బన్నీకి సబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. 

తాజాగా బన్నీ తన  సోషల్ మీడియా స్టేటస్ లో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి స్వయంగా వెల్లడించాడు. తన మొదటి సినిమా విజేత అని.. ఆసినిమాలో తాను నటించినందకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ ఇవ్వలేదని అన్నారు. అంతే కాదు ఈసినిమా ప్రొడ్యూసర్ స్వయంగా తన తండ్రే అని చెపుతూ.. ఓ ఫోటోను శేర్ చేసుకున్నారు. అంతే కాదు.. విజేత 100 డేస్ షీల్డ్ ను పట్టుకుని ఉన్న  తన తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఫోటోను శేర్ చేశారు బన్నీ. ఆ షీల్డ్ లో అల్లు రామలింగయ్య ఫోటో కనిపించడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. 

ఇక విజేత సినిమాలో వెంకటేష్ అనే క్యారెక్టర్ లో నటించాడు అల్లు అర్జున్. బన్నీకి ఈసినిమా మొదటిది. అంతే కాదు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈమూవీని అల్లు అరవింద్ నిర్మించారు. అల్లు రామలింగయ్య సమర్పించడంతో పాటు.. ఈమూవీలో నటించారు. చిరంజీవితో అత్యధిక చిత్రాలు  డైరెక్ట్ చేసిన కోదండరామిరెడ్డి  విజేత సినిమాను డ్రైవ్ చేశారు.ఇక ఈమూవీ చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మెగాస్టార్ కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ లో విజేత ముందుంటుంది. ఎందరో తారకు ఈ సినిమా ఫేవరేట్ మూవీగా మారింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.

పుష్ప2 మూవీ షూటింగ్ ను సూపర్ ఫస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు బన్నీటీమ్. నెక్ట్స్ సమ్మర్ ను టార్గెట్ చేశారు టీమ్. ఈమూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో జాయిన్ కాబోతున్నాడుఅల్లుఅర్జున్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి కాదు.. బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే గెస్ట్ ఎవరో తెలుసా? పాన్ ఇండియా అభిమానులకు పండగే?
Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా