ఆ కథని అల్లు అర్జున్ కాపీ కొట్టాడా?

Published : Apr 17, 2019, 01:39 PM IST
ఆ కథని అల్లు అర్జున్ కాపీ కొట్టాడా?

సారాంశం

తాజాగా అల్లు అర్జున్ , వేణు శ్రీరామ్ ల కాంబినేషన్ లో రూపొందే చిత్రం ఓ ఫిలిప్పీన్స్ చిత్రం కాపీ అంటూ ప్రచారం మొదలైంది. 

ఇన్ఫర్మేషన్ టెక్నాలిజీ రోజులివి. ప్రతీ విషయం ఫింగర్ టిప్స్ మీద ఉంటోంది. అక్కర్లేని సమాచారం సైతం మన మెదళ్లకు ఎక్కేస్తోంది. దాంతో ఏది నిజమో..ఏది అబద్దమో కూడా తెలియకుండా దాన్ని బుర్రకెక్కించుకుని ప్రచారం చేసేస్తున్నాం. ఇది ప్రతీ ఫీల్డ్ లోనూ జరుగుతోంది. సినిమా ఫీల్డ్ లో వచ్చే రూమర్స్ విషయంలో అయితే మరీను. మనకు ప్రమాదం లేదు కదా అని వాటిని ఫార్వర్డ్ చేసేస్తున్నారు. లాజిక్ గా ఆలోచిస్తే అందులో నిజమెంతో తెలిసే అవకాసం ఉన్నా ఎవరూ చేయటం లేదు.

తాజాగా అల్లు అర్జున్ , వేణు శ్రీరామ్ ల కాంబినేషన్ లో రూపొందే చిత్రం ఓ ఫిలిప్పీన్స్ చిత్రం కాపీ అంటూ ప్రచారం మొదలైంది. నాపేరు సూర్య.. సినిమా తరువాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమా రీసెంట్ గా ప్రారంభం అయ్యింది.  దీని తరువాత సుకుమార్, ఆ తరువాత వేణు శ్రీరామ్ తో సినిమా చేయాలి.  రీసెంట్ గా వేణు శ్రీరామ్ తో చేయబోయే సినిమా టైటిల్ అప్పుడే ఎనౌన్స్ చేశారు.  ఐకాన్.. కనటబడటం లేదు. 

ఈ టైటిల్ ను బట్టి చూస్తే.. ఇది ఫిలిప్పీన్స్ లో రెండేళ్ల క్రితం వచ్చిన కిటకిట సినిమా కాన్సెప్ట్ లా ఉందంటూ ప్రచారం మొదలైంది.  ఆ సినిమాలో హీరో హీరోయిన్లు అనుకోకుండా కలవడం అదే సమయంలో హీరోయిన్ తన కళ్ళను తాత్కాలికంగా కోల్పోవడంతో... ఆమెకు హీరో తోడుగా ఉండి జర్నీ చేస్తాడు.  కామెడీ, సెంటిమెంట్ డ్రామా ఎక్కువగా ఉన్న ఫిలిప్పీన్స్ సినిమా ఆకట్టుకుంది. 

అయితే అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో చేయదగ్గ కథ కాదది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథ అది. అందులో హీరో ప్రాధాన్యత పెద్దగా ఉండదు. అలాంటి కథను ఏదో చిన్న హీరోలు అయితే చేయగలుగుతారు కానీ బన్ని వంటి స్టార్ వ్యాల్యూ ఉన్న హీరోకు ఎన్ని మార్పులు చేసినా చేయటం కష్టం. అల్లు అర్జున్ కూడా కమర్షియల్ కొలతలు తెలిసిన వాడే కావటంతో ఆయన కూడా ఒప్పుకోరు. కేవటం టైటిల్ చూసి ఫలానా సినిమాకు ఫ్రీమేక్ అని ప్రచారం చేయటం మాత్రం దారుణం. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు