గోపీసుందర్ నిర్లక్ష్యం...‘మజిలీ’ నిర్మాతల ఫిర్యాదు?

By Prashanth MFirst Published Apr 17, 2019, 12:49 PM IST
Highlights

మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ కు అక్కడ కన్నా తెలుగులోనే ఎక్కడ మార్కెట్ ఉంది. ప్రతీ దర్శకుడు ఆయనతో పాటలు చేయించుకోవాలనే క్రేజ్ సంపాదించుకున్నాడు. శర్వానంద్ తో చేసిన  ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ దగ్గర్నుంచి ‘మజిలీ’ వరకు తెలుగులో   ఎన్నో మ్యూజికల్ హిట్లు ఇచ్చాడు.

మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ కు అక్కడ కన్నా తెలుగులోనే ఎక్కడ మార్కెట్ ఉంది. ప్రతీ దర్శకుడు ఆయనతో పాటలు చేయించుకోవాలనే క్రేజ్ సంపాదించుకున్నాడు. శర్వానంద్ తో చేసిన  ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ దగ్గర్నుంచి ‘మజిలీ’ వరకు తెలుగులో   ఎన్నో మ్యూజికల్ హిట్లు ఇచ్చాడు. కానీ ‘మజిలీ’ విషయంలో చేసిన పొరపాటు ఇప్పుడు ఆయన్ని టాలీవుడ్ అనుమానంగా చూసే సిట్యువేషన్ కు తెచ్చుకున్నాడు. 

‘మజిలీ’ సినిమాకు అంత మంచి ఆడియో ఇచ్చి కూడా నిర్మాతల కోపానికి గురి అయ్యాడు. ఆయనపై  తెలుగు ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు ‘మజిలీ’ నిర్మాతలు. మజిలీ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చే విషయంలో చివరి నిమిషంలో  తప్పుకోవటమే  అందుక్కారణం అని తెలుస్తోంది. 

లాస్ట్ మినిట్ లో  అతను చేతులెత్తేయడంతో తమన్‌తో బ్యాగ్రౌండ్ స్కోర్ చేయించుకోవాల్సి వచ్చింది. ఆ  దెబ్బకు ఒక టైమ్ లో ఈ చిత్రం ముందు అనుకున్న సమయానికి రిలీజ్ కావడమే కష్టంగా మారింది. ఇదే విషయమై దర్శకుడు శివ నిర్వాణ ఈ విషయమై మాట్లాడుతూ.. గోపీ సుందర్ వర్క మీద ఏమీ విమర్శలు చేయలేదు కానీ అసహనం చూపారు. కానీ నిర్మాతలు మాత్రం వదిలేలాగ లేరు.  

మజిలీ  నిర్మాతల్లో ఒకరైన సాహు గారపాటి మాత్రం ఈ విషయమై  తీవ్రంగానే స్పందించాడు. గోపీ ముందు ఇచ్చిన మాట ప్రకారం మార్చి మొదటి వారంలోనే బ్యాగ్రౌండ్ స్కోర్ పూర్తి చేయాల్సిందని.. కానీ తమకు కనీస ఇన్ఫర్మేషన్  ఇవ్వకుండా ఈ పని పక్కన పెట్టేశాడని చెప్పాడు సాహు. గోపీకి  పర్శనల్ ప్లాబ్లమ్స్ ఎన్నైనా ఉండచ్చు.. ఏమైనా ఉంటే ఉండొచ్చని.. కానీ కోట్ల రూపాయలతో ముడిపడ్డ సినిమా విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరి కాదని అయన అన్నారు. 

అలాగే ముందుగా అనుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం.. పని చేయకపోగా.. తమకు అతను సమాచారం కూడా ఇవ్వలేదని చెప్పాడు సాహు. చివరకు రిలీజ్ వాయిదా వేయాల్సి వస్తుందన్న భయంతో.. అప్పటికప్పుడు తమన్‌ను సంప్రదించి ఆర్ఆర్ చేయించుకున్నామని చెప్పాడు సాహు. తమన్ సినిమాను అర్థం చేసుకుని చక్కటి ఆర్ఆర్ ఇచ్చాడన్నాడు. 

ఇక  గోపీకి బ్యాగ్రౌండ్ స్కోర్‌కు కూడా కలిపి పూర్తి పేమెంట్ ఇచ్చామని.. తర్వాత తమన్‌కు కూడా వేరేగా డబ్బులిచ్చి పని చేయించుకున్నామని.. తమను ఇంతగా ఇబ్బంది  పెట్టిన గోపీ మీద ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేస్తామని చెప్పాడు. రిలీజ్ ముందే ఈ పని చేయాలనుకున్నప్పటికీ.. సినిమాపై నెగిటివ్ ఇంప్రెషన్  పడుతుందని ఆగినట్లు ఆయన చెప్పారు. 

click me!