వరలక్ష్మి శరత్ కుమార్ బర్త్ డే.. లేడీ విలన్ కొత్త సినిమా ‘శబరి’ నుంచి స్పెషల్ గ్లింప్స్!

By Asianet News  |  First Published Mar 5, 2023, 11:02 AM IST

లేడీ విలన్ వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) పుట్టిన రోజు సందర్భంగా తెలుగు చిత్రం ‘శబరి’ నుంచి స్పెషల్ మేకింగ్ గ్లింప్స్ ను విడుదల చేశారు.  ఈ సందర్భంగా టీమ్ ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. 
 


తమిళ నటి  వరలక్ష్మి శరత్ కుమార్ దక్షిణాది చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా నందమూరి బాలక్రిష్ణకు చెల్లెల్లిగా ‘వీరసింహారెడ్డి’తో నెగెటివ్ రోల్ లో నటించి మెప్పించింది. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విభిన్న పాత్రలు పోషిస్తూ ఆడియెన్స్ లో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తమిళం, తెలుగుతో పాటు మలయాళం, కన్నడలోనూ అవకాశాలను అందుకుంటున్నారు. ఏకంగా లెడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ఇండస్ట్రీతో తన మార్క్ క్రియేట్ చేస్తున్నారు. వరలక్ష్మి చేతిలో అరడజన్ కు పైగానే  చిత్రాలు ఉన్నాయి. 

లేడీ విలన్ గా గుర్తింపు పొందిన వరలక్ష్మి శరత్ కుమార్   తెలుగులో నటిస్తున్న తాజా చిత్రం ‘శబరి’(Sabari). ఈరోజు వరలక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేస్తూ.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహా మూవీస్ ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ కట్జ్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో రూపుదిద్దుకుంటోంది. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన మేకింగ్ గ్లింప్స్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. 

Latest Videos

నటుడు శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి 1985 మార్చి 5న బెంగళూరులో జన్మించింది. ఈ ఏడాదితో 38వ ఏట అడుగుపెట్టింది. 2012 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటోంది వరలక్ష్మి. ఎక్కువ తమిళ చిత్రాల్లోనే నటించిన ఈ ముద్దుగుమ్మ ‘తెనాలి రామక్రిష్ణ బీఏ.బీఎల్’, ‘క్రాక్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ దక్కించుకున్నారు. ఆ తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ అవకాశాలను సొంతం చేసుకుంటోంది. రీసెంట్ గా మైఖేల్ చిత్రంతోనూ అలరించింది. ప్రస్తుతం తెలుగులో ‘హను మాన్’,  ‘శబరి’లో నటిస్తోంది. తమిళంలో ‘పంబన్’,‘పిరంతల్ పరాశక్తి’, మలయాళం ‘కలర్స్’,‘లగామ్’లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 

 

What went behind in making! A sneak peek into the world of 🔥

▶️ https://t.co/SCeegBD37q

Wishing Our Dearest , A Very Happiest Birthday 🥳🎉 pic.twitter.com/eDeJ5tX8WO

— MAHA MOVIES (@MoviesByMaha)
click me!