
బిగ్ బాస్ ఫేమ్ విజే సన్నీ హీరోగా తెరకెక్కిన సినిమా సకల గుణాభిరామ. నర్వాల్, తరుణీ హీరోయిన్లుగా వెలిగొండ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈమూవీ ట్రైలర్ లాంట్ ఘనంగా జరిగింది.
బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ విజే సన్నీ హీరోగా నటించిన సినిమా సకల గుణాభిరామ ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌తో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా స్టార్ డైరెక్టర్ అనీల్ రావిపూడి, మాస్‌కాదాస్ విశ్వక్ సేన్ హాజరయ్యారు. అంతే కాదు ఈ ట్రైలర్ లాంచ్ లో సన్నీ క్లోజ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఫేమ్ మానస్, వరుణ్ సందేశ్‌లు కూడా సందడి చేశారు.
బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ మరికొంత మంది కూడా హాజరయ్యారయిన ఈ కార్యక్ర మానికి. ఆర్జే కాజల్ యాంకరింగ్ చేయడం కొసమెరుపు. ఈట్రైలర్ లాంచ్ కు అతిధిగా వచ్చిన విశ్వక్ సేన్ గురించి సన్నీ పలు ఆసక్తిక విషయాలను పంచుకున్నారు. సన్నీ బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా.. అతనికి సపోర్ట్ చేస్తూ విశ్వక్ సేన్.. సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే చేశాడు. చివరి వరకూ సన్నీ గెలుపు కోసం కృషి చేశాడు విశ్వక్ సేన్. ఈ విషయాలు చెపుతూ సన్నీ ఎమోషనల్ అయ్యాడు.
మొదటిగా నా తల్లి కళావతి థాంక్యూ సో మచ్ అంటూ స్టార్ట్ చేసిన సన్నీ... ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అనీల్ రావిపూడి, విశ్వక్ సేన్‌లతో పాటు.. నా బిగ్ బాస్ ఫ్యామిలీ మాచ్చాస్ అందరికీ థాంక్యూ.. నేను బిగ్ బాస్ టైటిల్ కొట్టానంటే.. కారణం నా స్నేహితులే. వాళ్లు నా వెనుక ఉంటారు నన్ను ముందుకు నడిపిస్తారు. లైఫ్‌లో కావాల్సింది పైసల్ కాదు.. దోస్తులు కావాలి.. ఇది గుర్తుపెట్టుకోండి. నేను నా స్నేహితుల్ని నమ్ముతా.. వాళ్లే నన్ను ముందుకు నడిపించి గెలిపించింది నా దోస్తులే. నా దోస్తులందరికీ నేను హీరో కావాలనే డ్రీమ్ ఉండేది.. ఆ డ్రీమ్‌ని ఈ సినిమా ద్వారా నిజం చేశానన్నారు.
ఈ ఈవెంట్‌కి పిలవగానే విశ్వక్ సేన్ అన్న.. అనీల్ అన్నా వచ్చారు. వాళ్ల గురించి రెండు మాటలు చెప్పాలి.. నేను బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు విశ్వక్ సేన్‌కి నేను ఎవరో తెలియదు. కానీ నేను హౌస్‌లో ఉన్నప్పుడు నాకు చాలా బాగా సపోర్ట్ ఇచ్చారని బయటకు రాగానే నా దోస్తులు చెప్పారు. ఒక ఫేమస్ హీరో నాకు జన్యున్‌గా సపోర్ట్ చేయడం. మీకు అందరికీ తెలియని ఇంకో విషయం ఏంటంటే.. విశ్వక్ సేన్ అన్న నాకు ఎంత సపోర్ట్ చేశారో.. అనీల్ రావిపూడి అన్న కూడా నాకు అంతే సపోర్ట్ ఇచ్చారు. నేను రాగానే అన్నని కలిశాను.. వాళ్ల డాటర్ కేక్ కట్ చేసిన వీడియో నాకు చూపించేసరికి నేను ఫిదా అయిపోయా.. అంటూ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాడు సన్నీ.