#Liger:నష్టపోయాం డబ్బులివ్వండి.. పూరికి మొదలైన సెగ

By Surya Prakash  |  First Published Aug 30, 2022, 10:36 AM IST

 డిజాస్టర్ టాక్ తో రెండో రోజే లైగర్ వసూళ్లు పడిపోయాయి.  షోస్ ఆడియన్స్ లేక క్యాన్సిల్ అవుతున్నాయి.  ఇవన్నీ చూస్తూంటే … డామేజ్ గట్టిగానే జరిగిందని అర్దమవుతోంది. ఇప్పుడు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్లు పూరిని కలుస్తున్నారనే వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది.



ఆకాశమంత ఆశలు పెట్టుకున్న లైగర్ మూవీ అధ్వాన్నమైపోయింది. లైగర్ భారీ నష్టాల దిశగా వెళుతుంది. వరల్డ్ వైడ్ లైగర్ నష్టాల అంచానా రూ. 50 కోట్లకు పైమాటే అంటోంది ట్రేడ్. వీకెండ్ కూడా ఈ సినిమాకు కలిసి రాలేదు. లైగర్ ని బిసి సెంటర్స్ లో మొదటివారం కాగానే తీసేయటానికి ఎగ్జిబిటర్లు సిద్ధపడుతున్నారు.నార్త్ లో లాల్ సింగ్ చడ్డాకు ఎదురైన పరిస్దితి  దీనికీ కనిపిస్తోంది. కనీస జనం లేక షోలు రద్దవుతున్న పరిస్థితి చాలా చోట్ల కనపుడుతోంది.

దాంతో ఎన్నో ఆశలు,నమ్మకాలు పెట్టుకుని భారి రేట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ పూర్తి నష్టాల్లోకి వెళ్లిపోయారు. చాలా ఏరియాల్లో ఈ సినిమాని అడ్వాన్స్ బేసిస్ మీద అమ్మారు. థియేటర్ బిజినెస్ డీల్ మొత్తం పూరి జగన్నాథ్ చూసుకున్నారు. దాంతో రిలీజ్ కు ముందు సినిమాకు లాభాలు వచ్చాయి. దిల్ రాజు వైజాగ్ ఏరియాని నాలుగు కోట్లు పెట్టి తీసుకున్నారు.

Latest Videos

దాంతో దిల్ రాజు, ఎన్ వి ప్రసాద్ కలిసి పూరి జగన్నాథ్ ని మీట్ అయ్యారని సమాచారం. సినిమా ఎంత దారుణంగా నష్టాలు తెచ్చిపెడుతోందో వివరించినట్లు తెలుస్తోంది.త్వరలోనే తమ నష్టాలు కాంపన్సేట్ చేయటానికి డిస్ట్రిబ్యూటర్స్ ..పూరి ని కలవబోతున్నారు. ఫైనాన్సియర్ చదలవాడ శ్రీనివాస రావు ,శోభన్ తో కలిసి ఆంధ్రీ థియేటర్ బిజినెస్  చేసారు. వరంగల్ శ్రీను నైజాం రైట్స్ తీసుకున్నారు. వీరంతా పూరి తో ఈ చిత్రం నష్టాల విషయమై టచ్ లో ఉండి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ తన సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలను తీరుస్తానని మాట ఇచ్చారంటున్నారు.

 ఈ వారంలోనే ఈ విషయమై మీటింగ్ జరగనుంది. నష్టాలు లెక్కలు అంచనా వేస్తున్నారు. ఆచార్య తలనొప్పి నుంచి ఇప్పుడిప్పుడే కొరటాల శివ కోలుకుంటున్నారు. ఇప్పుడు పూరి అదే సమస్యలో ఇరుక్కోవటం హాట్ టాపిక్ గా ఇండస్ట్రీలో మారింది.   లైగర్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న కరణ్ జోహార్ పూరి మీద కోపంగా ఉన్నారట. ఆయన ఇకపై ఏమాత్రం ఆదుకునే పరిస్థితి లేదని హిందీ సినీ వర్గాల నుంచి వినపడుతోంది. 

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర హక్కులను రూ. 67 కోట్లకు వరంగల్ శ్రీను దక్కించుకున్నట్లు సమాచారం. అసలు విజయ్ దేవరకొండ మార్కెట్ గురించి ఆలోచించకుండా రికార్డు ధరకు లైగర్ హక్కులను దక్కించుకున్నారు. రెస్పాప్ ఇండియా, ఓవర్సీస్ కలిపి రూ. 85 నుండి 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే కనీసం రూ. 120 కోట్ల వరకు రాబడితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే లైగర్ తో వంద కోట్ల నష్టం జరగవచ్చు.  

మరో ప్రక్క లైగర్ రిజల్ట్ తర్వాత నిర్మాత ఛార్మి మొదటిసారి మాట్లాడారు. సినిమా ఫెయిల్యూర్ కావడంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో కష్టాలు పడి సినిమా విడుదల చేస్తే ఫలితం నిరాశపరిచింది అన్నారు. 

click me!