నాగ చైతన్య బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ ఎవరంటే.. ఆమె పేరు చెప్పి ఫ్యాన్స్ కి షాకిచ్చాడుగా

By team teluguFirst Published Jan 17, 2022, 3:09 PM IST
Highlights

2016లో విడుదలైన సోగ్గాడే చిన్నినాయనా మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు తెరకెక్కింది. 

2016లో విడుదలైన సోగ్గాడే చిన్నినాయనా మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు తెరకెక్కింది. భోగి పండుగ రోజు విడుదలైన ఈ చిత్రం థియేటర్స్ లో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. నాగార్జున, నాగ చైతన్య కలసి నటించారు. 

ప్రస్తుతం నాగ చైతన్య వరుసగా ఇంటర్వ్యూలలో బంగార్రాజు చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారు. సమంత, నాగ చైతన్య గత ఏడాది విడాకులతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ అవుతున్నాడు. సమంతతో విడాకుల గురించి ఇటీవల నాగ చైతన్య స్పందించాడు. ఆ పరిస్థితుల్లో విడాకులు బెస్ట్ అనిపించింది. అందుకే విడిపోయినట్లు నాగ చైతన్య తెలిపాడు. 

రీసెంట్ గా నాగ చైతన్య తన ఆన్ స్క్రీన్ పెయిర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. తన బెస్ట్ ఆన్ స్క్రీన్ పై సమంతనే అని తెలిపి నాగ చైతన్య అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇద్దరూ విడిపోయారు కాబట్టి చైతు.. సమంత పేరు చెబుతాడా లేదా అనే సందేహం ఉండేది. కానీ నాగ చైతన్య మాత్రం తన బెస్ట్ ఆన్ స్క్రీన్ పై సమంతానే అని తేల్చి చెప్పాడు. 

వీరిద్దరూ ఏమాయ చేశావే, మనం, మజిలీ, ఆటో నగర్ సూర్య లాంటి చిత్రాల్లో నటించారు. వెండి తెరపై చైతు, సమంత సూపర్ హిట్ జోడిగా గుర్తింపు పొందారు. తాను నటించిన చిత్రాల్లో దేన్నైనా బాలీవుడ్ లో రీమేక్ చేయాల్సి వస్తే ఏ చిత్రం ఎంచుకుంటారు అని ప్రశ్నించగా చైతు 'మజిలీ' మూవీ పేరు చెప్పాడు. ఈ చిత్రంలో నాగ చైతన్య, సమంత కలసి నటించిన సంగతి తెలిసిందే. 

click me!