
స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్స్, జూనియర్లకు స్పేస్ ఇవ్వాలని సూచించారు. కొత్త వారిని తొక్కేయకూడదని వ్యాఖ్యానించారు. చందు మొండేటికన్నా ముందు ఇంకో వ్యక్తితో సినిమా అనుకున్నామని.. కానీ అతను గీతా ఆర్ట్స్ నుంచి బయటకు వెళ్లాడని అన్నారు. అతనికి అసలు అవకాశం ఇచ్చింది తామేనన్న అల్లు అరవింద్.. అతను ఎవరో ఇప్పుడే చెప్పనన్నారు. అయితే ఆ డైరెక్టర్ ఎవరు అన్న దానిపై ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.