తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విమానం‘. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలై ఏడిపించేస్తోంది. తండ్రీకొడుకుల మధ్య సన్నివేశాలు హృదయాలను తాకుతోంది.
తమిళ నటుడు, దర్శఖుడు సముద్రఖని (Samuthirakani) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విమానం‘ (Vimanam). ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూన్ 9న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. దీంతో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వదిలిన పోస్టర్లు, టీజర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఆ మధ్యన వచ్చిన టీజర్ లో సినిమాలోని క్యారెక్టర్లను పరిచయం చేసిన విషయం తెలిసిందే.
ఇక కొద్దిసేపటి కింద ఎమోషనల్ గా సాగిన ‘విమానం ట్రైలర్’ను యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) విడుదల చేశారు. ట్రైలర్ ఆడియెన్స్ హృదయాలను కదిలిస్తోంది. ఈసారి తండ్రీకొడుకుల మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఎమోషన్ సీన్స్ తో కంటతడి పెట్టించారు. ట్రైలర్ ప్రకారం.. బస్తీలో నివసించే ఓ తండ్రి నిత్యం తన కొడుకు కోసమే ఆలోచిస్తుంటాడు. ప్రతి పని తన బిడ్డ బాగుండాలనే చూస్తుంటాడు. ఈ క్రమంలోనే తన కొడుకుకు విమానం ఎక్కాలనే కోరిక పడుతుంది.
ఆ విషయం తెలుసుకున్న తండ్రి (సముద్రఖని) ఎలాగైనా తన బిడ్డను విమానం ఎక్కించాలని ప్రయత్నిస్తుంటాడు. అందుకు రూ.10 వేలు డబ్బు అవసరం అవుతుంది. అది సంపాదించేందుకు రాత్రి పగలు కష్టపడుతుంటాడు. కానీ చివరికి ఓ రోజు రాత్రి సముద్రఖని ఏడుస్తూ తన కొడుకు కనిపిస్తుంటాడు. దీంతో ఆ బాబు ఎమోషనల్ అవుతాడు. ఇంతకీ కొడుకు కోరికను తీర్చాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. కొడుకు సంతోషం కోసం తండ్రి పడే ఆవేదన హృదయాలను కదిలించేలా ఉంది. అలాగే వేశ్య పాత్రలో నటించిన అనసూయ, చెప్పులు కుట్టుకునే రాహుల్ రామకృష్ణ లవ్ స్టోరీ కూడా ఆకట్టుకునేలా ఉంది.
ట్రైలర్ తో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. భావోద్వేగాల వ్యక్తుల ప్రయాణాన్ని వెండితెరపై చూపించే ప్రయత్నమే ‘విమానం’గా తెలుస్తోంది. చిత్రానికి శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు. జూన్ 9న థియేటర్లలో విడుదల కానుంది.
A gut wrenching story of a father & son ✈️ TRAILER out now 🤗https://t.co/l3g6YW7P8Z
Landing at your nearest cinemas on June 9th 🛫 pic.twitter.com/SuYmohgGTd