అరవింద్ ‘ఆహా ఓటీటీ’కు అదే పెద్ద దెబ్బ

By Surya PrakashFirst Published Mar 24, 2020, 2:29 PM IST
Highlights

గీతా ఆర్ట్స్ సంస్థలో భారీ కమర్షియల్ సినిమాలు నిర్మించిన అరవింద్.. ‘ఆహా ఓటీటీ’ ద్వారా డిజిటల్ రంగంలోనూ సెన్సేషన్ క్రియేట్ చేయటానికి రంగం సిద్దం చేసారు. అయితే అందుకు కొన్ని ఇబ్బందులు వచ్చి పడ్డాయి. 


స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ డిజిటల్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యి సక్సెస్ దిసగా ప్రయాణం పెట్టుకున్న సంగతి తెలిసిందే. ట్రెండ్‌కి తగ్గట్టు, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు నిర్మించడంలో ఆయనది అందె వేసిన చేయి గా ఆయనకు పేరుంది. ముఖ్యంగా.. ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో ఆయన ఎంపిక చేసే స్క్రిప్టులకు ఎవరూ సాటి రారు అని పేరుంది. 

 గీతా ఆర్ట్స్ సంస్థలో భారీ కమర్షియల్ సినిమాలు నిర్మించిన అరవింద్.. ‘ఆహా ఓటీటీ’ ద్వారా డిజిటల్ రంగంలోనూ సెన్సేషన్ క్రియేట్ చేయటానికి రంగం సిద్దం చేసారు. అయితే అందుకు కొన్ని ఇబ్బందులు వచ్చి పడ్డాయి.  ‘ఆహా ఓటీటీ’ లో చాలా లిమెటెడ్ మూవీ,కంటెట్ ఉన్నారు. ఉగాది నుంచి కొత్త ప్రమోషన్స్ ప్రారంభించి, కంటెంట్ పెంచుదామనుకున్నారు. 

అయితే కరోనా వచ్చి అరవింద్ ప్లాన్ ని నాశనం చేసేసింది. ఓ ప్రక్కన అంతటా సినిమా థియేటర్లు మూత పడడంతో పాటు టీవి సీరియల్స్ నిర్మాణం కూడా ఆగిపోయింది. దీంతో జనం ఎంటర్టైన్మెంట్ కు ఓ.టి.టి. స్ట్రీమింగ్ మీదే డిపెండ్ అవ్వాల్సిన పరిస్దితి. ఈ నేపధ్యంలో నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోకి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ ట్రాఫిక్ ని తమవైపు మళ్లించుకునే పరిస్దితి  ‘ఆహా ఓటీటీ’ కు కనపడటం లేదు. మరింత కంటెంట్ అప్ లోడ్ చేస్తేనే కానీ జనం కనెక్ట్ కారు. కాబట్టి అల్లు అరవింద్ వెంటనే మేల్కొని తన పాత సినిమాలు అయినా ఇందులో అప్ లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. 

click me!