తమ బ్యానర్ లో చేయమని అరవింద్ ఆఫర్,డైరక్టర్ ఖుషి

Surya Prakash   | Asianet News
Published : Oct 25, 2020, 07:10 AM IST
తమ బ్యానర్ లో చేయమని అరవింద్ ఆఫర్,డైరక్టర్ ఖుషి

సారాంశం

అరవింద్ అవకాసం ఇచ్చారంటే ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారి ఆ డైరక్టర్ వైపు చూస్తుంది. మిగతా నిర్మాతలు లాక్ చేయటానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ‘కలర్‌ ఫోటో’ దర్సకుడుకి అదే జరుగుతున్నట్లు సమాచారం.   

అల్లు అరవింద్ వంటి పెద్ద నిర్మాత నుంచి ఆఫర్ వచ్చిందంటే ఆ దర్శకుడి పంట పండినట్లే. ఎందుకంటే అరవింద్ అవకాసం ఇచ్చారంటే ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారి ఆ డైరక్టర్ వైపు చూస్తుంది. మిగతా నిర్మాతలు లాక్ చేయటానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ‘కలర్‌ ఫోటో’ దర్సకుడుకి అదే జరుగుతున్నట్లు సమాచారం. 

సుహాస్‌, చాందిని, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కలర్‌ ఫోటో’. సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం సమకూర్చారు. అక్టోబరు 23న ఓటీటీ వేదికగా ఆహాలో చిత్రం విడుదలైంది. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన లభించింది. ఈ స్పందన  చూసిన అల్లు అరవింద్ ఈ దర్సకుడు తమ ఆహా ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయమని కోరినట్లు తెలుస్తోంది.ఇప్పటికే సందీప్ రాజ్ రెండు సినిమాలు సైన్ చేసారు. దాంతో ఇది మూడో సినిమా. పెద్ద నిర్మాత నుంచి వచ్చిన ఆఫర్ కావటంతో చాలా ఆనందంగా ఉన్నట్లు సమాచారం. ఇంతకు ముందు కూడా అల్లు అరవింద్..పలాస దర్శకుడుకు రిలీజ్ కు ముందే అడ్వాన్స్ చెక్ ఇచ్చి ఆఫర్ ఇచ్చారు. 

మరో ప్రక్క  ‘కలర్‌ ఫోటో’ చిత్ర బృందంపై నాని, ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు కురిపించారు. చక్కటి కథాంశంతో చిత్రాన్ని రూపొందించారంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. నాని ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘ఈ చిత్రం నాకెంతో నచ్చింది. చిట్టి ముత్యం ఈ సినిమా. కాదని ఎవరన్నా అంటే..’ అని ట్వీట్‌ చేశారు. ‘‘కలర్‌ ఫోటో’పై పాజిటివ్‌ కామెంట్లు చాలా విన్నా. సంతోషంగా ఉంది. మొత్తం చిత్ర యూనిట్ నికి కుడోస్‌’ అని మంచు మనోజ్‌ పేర్కొన్నారు.

‘‘కలర్‌ ఫోటో’లోని ప్రతి సన్నివేశం నాకు వినోదం పంచింది. సుహాస్‌ ప్రతి ఫ్రేమ్‌లో నచ్చాడు. అతడికి నటుడిగా ఎంతో భవిష్యత్తు ఉంది. సందీప్‌ రాజ్‌ సినిమా చాలా బాగా రాసి, తీశావు. కాన్సెప్ట్‌ నాకెంతో నచ్చింది. సునీల్‌ గారు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అదరగొట్టేశారు సర్. మా తమ్ముడని కాదు కానీ, నేపథ్య సంగీతం, పాటలతో కాల భైరవ సినిమాకు ప్రాణం పోశాడు. ‘కలర్‌ ఫోటో’ సినిమా చూడండి..’ అని కార్తికేయ ట్వీట్లు చేశాడు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?