#Allu Aravind:అల్లువారి 'మహాభారతం'.. అధికారిక ప్రకటన వచ్చింది!

By Surya PrakashFirst Published Sep 10, 2022, 6:13 PM IST
Highlights

 కాలిఫోర్నియాలోని అనాహైమ్ లో జరుగుతున్న డిస్నీ D23 ఎక్స్పోలో శుక్రవారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ప్రకటన చేసింది. తమ అత్యంత ప్రతిష్టాత్మక అతిపెద్ద ప్రాజెక్ట్ "మహాభారతం" ను అధికారికంగా ప్రకటించింది. 

దర్శకధీరుడు రాజమౌళి  తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' అని చెప్పారు. అయితే రాజమౌళి మహాభారతాన్ని ఎప్పుడు తెరకెక్కిస్తాడో తెలీదు కానీ.. అంతకంటే ముందే సిరీస్ రూపంలో భారీస్థాయిలో 'మహాభారతం' రాబోతుంది. అల్లు అరవింద్, మధు మంతెన కలిసి ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. మొదట సినిమాగా తెరకెక్కించాలనుకున్నా ఇప్పుడు దానిని సిరీస్ గా తీసుకు రావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. 

అనేక  సీజన్లుగా రానున్న ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మొదటి సీజన్ 2024 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియాలోని అనాహైమ్ లో జరుగుతున్న డిస్నీ D23 ఎక్స్పోలో శుక్రవారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ప్రకటన చేసింది. తమ అత్యంత ప్రతిష్టాత్మక అతిపెద్ద ప్రాజెక్ట్ "మహాభారతం" ను అధికారికంగా ప్రకటించింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఈ బిగ్ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు.

బాలీవుడ్ నిర్మాత మధు మంతెన మైథోవర్స్ స్టూడియోస్ మరియు అల్లు ఎంటర్టైన్మెంట్ లతో కలిసి ఈ ప్రాజెక్ట్ ను రూపొందించనున్నారు. "గ్రేటెస్ట్ ఇతిహాసం- మునుపెన్నడూ చూడని స్థాయిలో తిరిగి చెప్పబడుతుంది!. ఒక అద్భుతమైన దృశ్యం కోసం చూస్తూ ఉండండి. 'మహాభారత్' త్వరలో రాబోతోంది" అని డిస్నీ హాట్ స్టార్ పేర్కొంది. ఈ సందర్భంగా మహాభారతం ఆర్ట్ వర్క్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంది.

దాదాపు 2500 కోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో విజువల్ వండర్ గా ఈ సిరీస్ ను నిర్మించనున్నారని టాక్. తెలుగు హిందీ ఇంగ్లీష్ లతో పాటుగా పలు ఇతర ప్రధాన భారతీయ భాషల్లో ఈ సిరీస్ ని రూపొందించనున్నారట. స్టార్ క్యాస్టింగ్ - అగ్రశ్రేణి సాంకేతిక బృందం ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో 'మహాభారతం' ను డీల్ చేసే దర్శకుడు మరియు లీడ్ యాక్టర్స్ ను ప్రకటించనున్నారు.  నటీనటులు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.

click me!