‘నాంది’ హీరో మొదట నరేష్ కాదట..మరి?

By Surya Prakash  |  First Published Feb 20, 2021, 4:17 PM IST


 అల్లరి నరేశ్‌ గత కొన్నేళ్లుగా ప్లాప్‌లతో సతమతమవుతున్నాడు. దీంతో తన కామెడీ ఇమేజ్‌ని పక్కన పెట్టి ప్రయోగంగా ‘నాంది’ సినిమా చేశాడు. శుక్రవారం(ఫిబ్రవరి 19) విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. నరేశ్‌ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కామెడీ మాత్రమే కాదు ఎమోషనల్‌ పాత్రలను కూడా చేయగలడని ‘నాంది’తో నిరూపించుకున్నాడు.  
 


శుక్రవారం విడుదలైన అల్లరి నరేశ్‌ ‘నాంది’ సినిమాకి అద్భుత స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. మార్నింగ్‌ షో నుంచి సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. నరేశ్‌ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. నరేష్ లో మంచి నటుడు ఉన్నాడని సినిమా చూసిన ప్రేక్షకులంతా మెచ్చుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంభందించిన ఓ వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమాకి మొదట హీరోగా అల్లరి నరేష్‌ మొదట ఆప్షన్ కాదట. దర్శకుడు, రచయిత అనుకున్న హీరో ఈ సినిమాను తిరస్కరించడంతో ఈ సినిమా నరేష్ చేతికి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సినిమాకి అందుతున్న ఆదరణ చూస్తే కచ్చితంగా ఆ హీరో తన కెరీర్‌లో ఓ గొప్ప కథను వదులుకున్నారని ప్రేక్షకులు అంటున్నారు. అయితే ఆ హీరో ఎవరు...

టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆ హీర మరెవరో కాదు  శర్వానంద్.మొదట శర్వానంద్.. ఈ సినిమాకు మొదటగా కలిసి కథ చెప్పారట, కానీ శర్వా ఈ సినిమాపై ఇంట్రస్ట్  చూపకపోవడంతో నాంది నరేష్ చెంతకు చేరిందని అంటున్నారు. ఈ కథ విన్న నరేష్ వెంటనే ఓకే చెప్పేశారంట. ఈ సినిమా కోసం నరేష్ పడిన కష్టం అంతా ఇంత కాదు. ఇప్పుడు నరేష్ కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని అభిమానులు నరేష్ నటనను కొనియాడుతున్నారు. అయితే శర్వా వద్దకు కథ వెళ్లిందనేది ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది. 

Latest Videos

ఇక నాంది  సినిమా షూటింగ్‌ పూర్తై చాలా కాలం అయినా కూడా కరోనా కారణంగా నిన్న విడుదల అయ్యింది. అల్లరి నరేష్‌ సుదీర్ఘ కాలం తర్వాత ఈ సినిమాతో పాజిటివ్‌ టాక్ ను దక్కించుకున్నాడు. కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ తో నరేష్ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తో అల్లరి నరేష్ మళ్లీ మునుపటి ఫామ్‌ లోకి వస్తాడని మొదటి నుండి అనుకున్నాడనే మాట నిజం అయ్యింది.  

ఇక చాలా కాలం తర్వాత సక్సెస్‌ని చూడడంతో నరేశ్‌ సంతోషంతో ఉబ్బితబ్బిపోతున్నాడు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నరేశ్‌ఎమోషనల్‌ అయి కనీళ్లు పెట్టుకున్నాడు.  తండ్రిగా నటించిన దర్శకుడు, నటుడు దేవిప్రసాద్‌ని హత్తుకుని ఏడ్చేశాడు. 
 

click me!