భలే భలే మగాడివోయ్ కథను రిజెక్ట్ చేయలేదు.. కానీ: నరేష్

Published : Sep 24, 2019, 12:04 PM IST
భలే భలే మగాడివోయ్ కథను రిజెక్ట్ చేయలేదు.. కానీ: నరేష్

సారాంశం

జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న నరేష్ దగ్గరికి అప్పట్లో మారుతి ఒక కథను వినిపించినట్లు టాక్ వచ్చింది. మెయిన్ గా భలే భలే మగాడివోయ్ సినిమా కథను సునీల్ కు చెప్పిన తరువాత అల్లరి నరేష్ దగ్గరికి వెళ్లినట్లు టాక్ వచ్చింది.

ఒకప్పుడు మినిమమ్ హిట్స్ తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద తనకంటూ ఒక మార్కెట్ సెట్ చేసుకున్న అల్లరి నరేష్ వరుస అపజయాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న నరేష్ దగ్గరికి అప్పట్లో మారుతి ఒక కథను వినిపించినట్లు టాక్ వచ్చింది. 

మెయిన్ గా భలే భలే మగాడివోయ్ సినిమా కథను సునీల్ కు చెప్పిన తరువాత అల్లరి నరేష్ దగ్గరికి వెళ్లినట్లు టాక్ వచ్చింది. ఇకపోతే ఆ విషయంపై రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేష్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మారుతి తనకు కథను చెప్పిన విషయం వాస్తవమే కానీ అది భలే భలే మగాడివోయ్ కథ కాదని నరేష్ చెప్పారు. 

తనకు పూర్తిగా వేరే కథను వివరించారని అన్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ ఎలాంటిదనేది నరేష్ చెప్పలేదు. ప్రస్తుతం పలు కామెడీ ఎంటర్టైనర్ కథలతో అల్లరోడు బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ బంగారు బుల్లోడు అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. చివరగా నరేష్ మహేష్ బాబుతో మహర్షి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ