పుల్వామా ఎఫెక్ట్.. పాక్ నటులపై నిషేధం!

By Udaya DFirst Published Feb 18, 2019, 3:38 PM IST
Highlights

పుల్వామా ఘటనలో మన జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. నలభై మందికి పైగా జవానులు ఈ ఘటనలో అమరులయ్యారు. ఈ ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. 

పుల్వామా ఘటనలో మన జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. నలభై మందికి పైగా జవానులు ఈ ఘటనలో అమరులయ్యారు. ఈ ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. ప్రతీ ఒక్కరూ ఈ ఘటనపై స్పందించి.. జవాన్లకు నివాళులు అర్పించారు.

దీనికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఉగ్రదాడికి నిరసనగా సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమా ఇండస్ట్రీలో పని చేసే పాకిస్తాన్ కి చెందిననటీనటులపై నిషేధం విధించింది.

తన సినిమాల్లో పాక్ నటీనటులను తీసుకోవడానికి వీల్లేదంటూ ప్రకటించింది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తన 'టోటల్ ధమాల్' సినిమాను పాకిస్తాన్ లో విడుదల చేయడం లేదంటూ ప్రకటించారు. అమరులైన సైనిక కుటుంబాలకు చిత్రబృందం తరఫున యాభై లక్షల విరాళాన్ని ప్రకటించారు. 

click me!