
ఎవరి పాడితే మనస్సు తేలికవుతుందో.. ఉత్తేజం ఉప్పొంగుతోందో ఆయనే సిద్ శ్రీరామ్. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్,బాలీవుడ్.. అన్ని ఇండస్ట్రీలో.. అద్భుతమైన గాత్రంతో రాణిస్తున్న యంగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్. తెలుగు, తమిళం భాషల్లో రిలీజ్ అవుతున్న చిత్రాలకు తన గాత్రం అందిస్తూ.. ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్తున్నారు.
గాడ్ గిఫ్టెడ్ టోన్ తో సిద్ శ్రీరామ్ యూత్ ను బాగా ఆట్టుకున్నారు. ఈయన ప్రేక్షకులనే కాదు.. ఇండస్ట్రీలోని హీరోలను, సినీ ప్రముఖులను కూడా తన టోన్ తో మంత్రముగ్ధులను చేస్తున్నాడు. తాజా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సిద్ శ్రీరామ్ గాత్రానికి ఉప్పొంగిపోయారు. సిద్ పాటకు ఆనందపరవశంలో మునిగి తేలారు బన్నీ. ఇందుకు సిద్ ను ప్రశంసించారు.
స్టార్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్, సౌత్ కా సుల్తాన్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ ‘పుష్ప’. ఈ మూవీ కథ పరంగానే కాకుండా.. పాట పరంగానూ ప్రపంచాన్ని చుట్టేస్తుంది. క్రికెట్ స్టార్స్, యూత్, ఏకంగా ‘ప్రధాని మోడీ’నే సిద్ పాడిన ‘శ్రీ వల్లి’ పాటకు స్టెప్పులేశారు.
అయితే ఈ మూమీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సిద్ శ్రీరామ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ లో భాగంగాా ‘శ్రీ వల్లి’ పాటను పాడారు. ఎలాంటి మ్యూజిక్ సపోర్ట్ లేకుండా సిద్ తన గాత్రంతో ఫంక్షన్ కు వచ్చిన అతిథులను, ముఖ్యులను అలరించారు. ఈ క్రమంలో బన్నీ కూడా ఫిదా అయ్యారు. కాగా, తాజాగా సిద్ పాడుతున్న వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు అల్లు అర్జున్.
‘నా సోదరుడు సిద్దు శ్రీరామ్ పుష్ఫ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మ్యూజిక్ లేకుండా ‘శ్రీ వల్లి’ పాటను పాడటం ప్రారంభించాడు. మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్స్ వాయిస్తారని అనుకున్నా.. కానీ వారు ఎలాంటి మ్యూజిక్ అందించలేదు. సిద్ మాత్రం మ్యూజిక్ లేకుండా పాడుతున్నారు. ప్రత్యక్షంగా సిద్ పాడుతుంటం చూసి అద్భుతం అనిపించింది. అందుకే అతని సంగీతం అవసరం లేదు.. అతనే సంగీతం.’ అంటూ బన్నీ సిద్ ను ప్రశంసించారు.