'RRR' ప్రాజెక్ట్ పై అలియాభట్ కామెంట్స్!

Published : Mar 14, 2019, 02:42 PM IST
'RRR' ప్రాజెక్ట్ పై అలియాభట్ కామెంట్స్!

సారాంశం

ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న భారీ చిత్రం 'RRR'. గత కొద్దిరోజులుగా ఈ సినిమాపై వస్తోన్న వార్తలపై దర్శకుడు రాజమౌళి తాజాగా క్లారిటీ ఇచ్చాడు. 

ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న భారీ చిత్రం 'RRR'. గత కొద్దిరోజులుగా ఈ సినిమాపై వస్తోన్న వార్తలపై దర్శకుడు రాజమౌళి తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాకి అన్ని భాషల్లో 'RRR'అనే టైటిల్ కామన్ గా ఉంటుందని, అయితే ఒక్కో భాషలో ఒక్కో ఎక్స్పాన్షన్ ఉంటుందని చెప్పారు.

రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా అలియా భట్, ఎన్టీఆర్ కి జోడీగా విదేశీ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ ని తీసుకున్నారు. అయితే 'RRR' సంస్థ తమ ట్విట్టర్ ద్వారా  సినిమాలో అలియాభట్ నటిస్తుందని.. అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ మార్చి 15న పుట్టినరోజు జరుపుకోనున్న ఆమెకి అడ్వాన్స్ విషెస్ తెలిపింది.

ఈ ట్వీట్ కి స్పందించిన అలియా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. భారీ తారాగణం, అతడి పెద్ద టీంతో అందమైన ప్రయాణం ప్రారంభించడానికి వేచి ఉండలేకపోతున్నాను అంటూ వెల్లడించింది. ఈ సందర్భంగా రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపింది.  

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!