RRR కథ ఎలా పుట్టిందంటే..

Published : Mar 14, 2019, 02:34 PM ISTUpdated : Mar 14, 2019, 02:35 PM IST
RRR కథ ఎలా పుట్టిందంటే..

సారాంశం

ఈ మర్రిచెట్టు లాంటి మల్టీస్టారర్ కి మొదటి బీజం ఎక్కడ పడిందో అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఎంతో ఆసక్తిని రేపింది. ఆ విషయాన్నీ జక్కన్న ఈ విధంగా చెప్పాడు. 

ఆలోచన చిన్నదే అయ్యి ఉండవచ్చు కానీ కాలం పరిగెడుతున్న సమయంలో కథ స్కెల్ ఏ స్థాయిలో పెరుగుతుందో రాజమౌళి ఓ క్లారిటీ ఇచ్చాడు. RRR కథ గురించి అన్ని క్లారిటీలు ఇచ్చేశారు. ఇక తెరపై సరికొత్త స్వాతంత్య్ర సమర యోధులను చూడటానికి సిద్ధంగా ఉండండని జక్కన్న టీమ్ ఆన్సర్ ఇచ్చింది. 

అయితే అసలు ఈ మర్రిచెట్టు లాంటి మల్టీస్టారర్ కి మొదటి బీజం ఎక్కడ పడిందో అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఎంతో ఆసక్తిని రేపింది. ఆ విషయాన్నీ జక్కన్న ఈ విధంగా చెప్పాడు. 

2004 లో వచ్చిన ది మోటార్ సైకిల్ డైరీస్ అనే స్పానిష్ సినిమా చూసినపుడు మొదటి నుంచి కథలో చే అనే ఒక కుర్రాడి చుట్టూ కథ సాగుతుంటుంది సినిమా లాస్ట్ లో ఎవరు ఊహించని విధంగా ఇప్పటివరకు సాగిన కథలో పాత్రలో ఉన్నది మరెవరో కాదు. అతనే చేగువేరా అని ఎండ్ లో తెలుస్తుంది. అప్పుడే అది చాలా బావుందని మనం కూడా ఇలాంటి కథను తెరకెక్కిస్తే బావుంటుందని అనుకున్నా. 

అప్పుడే రాజు అనే కుర్రాడి కథను కూడా అదే ఫ్లోలో చూపించి అలాంటి ట్విస్ట్ ఇవ్వాలని అనిపించింది. ఇక కొమరం భీమ్ కథ కూడా తట్టడంతో ఇద్దరి కథలను కల్పిత కథగా రూపొందించి ఎవరికీ తెలియని కథను సృష్టించినట్లు జక్కన్న వివరణ ఇచ్చాడు.  

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!