ఆగస్ట్ నుంచి ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ షూటింగ్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్ ని కన్‌ఫ్యూజన్‌లో పెట్టిన నీల్‌ మామ.

Published : May 20, 2024, 11:21 AM IST
ఆగస్ట్ నుంచి ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ షూటింగ్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్ ని కన్‌ఫ్యూజన్‌లో పెట్టిన నీల్‌ మామ.

సారాంశం

ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌ లో రాబోతున్న సినిమాకు సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది. తారక్‌ ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌ చెప్పి, ప్రభాస్‌ ఫ్యాన్స్ ని కన్‌ ఫ్యూజన్‌లో పెట్టాడు.   

ఎన్టీఆర్‌ సినిమాలకు సంబంధించిన భారీ ప్రాజెక్ట్ లను సెట్‌ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దసరాకి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీంతోపాటు `కేజీఎఫ్‌`, `సలార్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. రెండేళ్ల క్రితమే దీన్ని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. ప్రభాస్‌తో చేస్తున్న `సలార్‌` షూటింగ్‌ ఆలస్యం కారణంగా ఈ మూవీ డిలే అవుతూ వస్తోంది. 

ఇదిలా ఉంటే `సలార్‌`కి రెండో పార్ట్ కూడా ఉంది. `సలార్‌ 2` త్వరలోనే రూపొందుతుందని, ఆ తర్వాతనే ఎన్టీఆర్‌ మూవీ స్టార్ట్ అవుతుందని అనే వాదన ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీపై అప్‌డేట్‌ వచ్చింది. ఎన్టీఆర్‌, నీల్‌ మూవీ షూటింగ్‌ అప్‌ డేట్‌ ఇచ్చింది యూనిట్‌. తారక్‌ పుట్టిన రోజుని పురస్కరించుకుని సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఆగస్ట్ నుంచి ఈ మూవీ షూటింగ్‌ స్టార్ట్ కానుందని తెలిపింది. పవర్‌ హౌజ్‌ ప్రాజెక్ట్ గా వెల్లడించింది టీమ్‌. 

దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ లో ఆనందానికి అవధుల్లేవని చెప్పొచ్చు. వారంతా ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఎన్టీఆర్‌ అభిమానులకు శుభవార్త చెప్పిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్ ని మాత్రం డైలమాలో పడేశారు. `సలార్‌2`పై పెద్ద సస్పెన్స్ ని పెట్టారు. ఈ మూవీ ఎప్పుడు ప్రారంభమవుతుందనే సస్పెన్స్ ని పెంచారు. వచ్చే నెలలోనే ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్ అవుతుందనే వార్తలు మొన్నటి వరకు చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు నీల్‌ మామ ట్విస్ట్ ఇవ్వడంతో డార్లింగ్‌ అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎన్టీఆర్‌ మూవీ స్టార్ట్ అయితే ఏడాదిపైనే పడుతుంది. మరి `సలార్‌ 2` ఎప్పుడు ఉంటుందనేది సస్పెన్స్ గా మారింది. 

జూన్‌లో ప్రారంభించి ఆగస్ట్ వరకు `సలార్‌ 2` షూటింగ్‌ కంప్లీట్‌ చేయాలనుకుంటున్నారా? లేక తారక్‌ మూవీ తర్వాతనే చేయాలనుకుంటున్నారా? అనేది మిస్టరీగా మారుతుంది. ఒక వేళ ఈ రెండు నెలల్లో `సలార్‌ 2` షూటింగ్‌ కంప్లీట్‌ చేస్తే పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ ఎప్పుడు చేస్తారనేది మరో మిస్టరీ. అయితే ఇప్పటికే `సలార్‌ 2`కి సంబంధించిన చాలా వరకు షూటింగ్‌ అయిపోయిందట. మొదటి పార్ట్ సమయంలోనే చాలా వరకు ప్రభాస్‌పై సీన్లు తీశారు. దాదాపు 70శాతం షూటింగ్‌ అయిపోయినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్‌, నీల్‌ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కబోతుంది.   
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?